బౌరంపేట్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన అర్కల విజయ్ గౌడ్
మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డిని కలిసి కృతజ్ఞతలు
కుత్బుల్లాపూర్, జూలై 2 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బౌరంపేట్ డివిజన్ (295) కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన అర్కల విజయ్ గౌడ్ గురువారం మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బౌరంపేట్ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని అర్కల విజయ్ గౌడ్ పేర్కొన్నారు. పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ, పార్టీ అభివృద్ధికి కష్టపడి పనిచేయాలని, ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని అర్కల విజయ్ గౌడ్‌కు సూచించారు. పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఫిషర్‌మెన్ కాంగ్రెస్ చైర్మన్ పోచి మహేష్ ముదిరాజ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు చింతకింది సురేష్, దమ్మగారి వెంకట్ రెడ్డి, సాల్మన్ రాజు, బైండ్ల దయానంద్, కమలమ్మ, హేమలతతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.