NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 2:42 pm Posted by : NAMASTHE BHARAT

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోండి

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోండి

ఎంపీడీఓ వనపర్తి అధ్వైత

ఖానాపురం జులై28 ( నమస్తే భారత్ ) :

తెలంగాణ ప్రభుత్వం టీజీఓబిఎంఎంఎస్ పోర్టల్ ద్వారా వివిధ సంక్షేమ పథకాల కింద అర్హులైన లబ్ధిదారుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోందని ఎంపీడీఓ వనపర్తి అధ్వైత తెలిపారు. ఈసందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ ఖానాపురం మండలంలోని మైనార్టీ సోదరులు, సోదరీమణులు ప్రభుత్వం అందిస్తున్న మోటార్ ట్రక్/యూనిట్, ఈ-స్కూటర్, నెట్ వ్యాపార యూనిట్లు తదితర స్వయం ఉపాధి పథకాల కోసం ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలన్నారు.అలాగే, వికలాంగులైన అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న బ్యాటరీ వీల్‌చైర్లు,ట్రైసైకిళ్లు, క్రచ్‌లు, లాప్‌టాప్‌లు కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. స్వయం ఉపాధి ఆకాంక్ష కలిగిన అర్హులైన లబ్ధిదారులు 31-07-2026 లోపు మీ సేవ కేంద్రం ద్వారా లేదా మీ ఉండే గ్రామంలోని అర్హులైన వార్డుల ద్వారా దరఖాస్తు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందాలని కోరారు.అర్హులైన అభ్యర్థులు “టీజీఓబిఎంఎంఎస్ “పోర్టల్ ద్వారా మీ సేవలో వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సువర్ణావకాశాన్ని ప్రతి అర్హులైన లబ్ధిదారుడు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.