NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 9:25 pm Posted by : NAMASTHE BHARAT

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం

జూలై 13లోపు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.. అర్హులైన ఉపాధ్యాయులకు డీఈఓ సూచన

కుత్బుల్లాపూర్, జులై 9, ( నమస్తే భరత్ ) : జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన ఉపాధ్యాయులకు అందించే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు–2026 కోసం జిల్లాలోని అర్హులైన ప్రభుత్వ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి కోరారు. కేంద్ర విద్యాశాఖ నిర్వహిస్తున్న ఈ పురస్కారాలకు అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన ఉపాధ్యాయులు జూలై 13లోపు అధికారిక పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని అర్హులైన ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ దరఖాస్తులను నిర్ణీత గడువులోగా సమర్పించాలని డీఈఓ విజ్ఞప్తి చేశారు.

మెదక్ జిల్లాలో 2,877 మంది ఉపాధ్యాయులకు శిక్షణ

నేటి నుంచి 30 వరకు మూడు కేంద్రాల్లో నిర్వహణ.. తప్పనిసరిగా హాజరుకావాలని డీఈఓ ఆదేశం

జిల్లాలోని 2,877 మంది ఉపాధ్యాయులకు ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ కింద ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు బోధనా నైపుణ్యాల పెంపు, నూతన విద్యా విధానాల అమలుపై ఈ శిక్షణ అందించనున్నారు. జిల్లాలోని డీపీఎస్ నాచారం, జెడ్పీహెచ్‌ఎస్ నర్సాపూర్, జెడ్పీహెచ్‌ఎస్ కౌడిపల్లి కేంద్రాల్లో ఈ నెల 9 నుంచి 30వ తేదీ వరకు దశలవారీగా కార్యక్రమం కొనసాగుతుంది. సంబంధిత ఉపాధ్యాయులు తమకు కేటాయించిన తేదీల్లో శిక్షణకు తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి సూచించారు