NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 9:31 pm Posted by : NAMASTHE BHARAT

మరిపెడ బీసీ కళాశాల బాలుర వసతి గృహంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

మరిపెడ బీసీ కళాశాల బాలుర వసతి గృహంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

వసతి గృహ సంక్షేమ అధికారి ఎస్. కల్పన

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడలోని బీసీ కళాశాల బాలుర వసతి గృహంలో ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వసతి గృహ సంక్షేమ అధికారి ఎస్. కల్పన తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆమె మాట్లాడుతూ మరిపెడలో విద్యనభ్యసిస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఓసీ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ మరియు ఒకేషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. ప్రస్తుతం వసతి గృహంలో 80 సీట్లు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి గల విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని.సూచించారు.మరిన్ని వివరాల కోసం వసతి గృహ సంక్షేమ అధికారి ఎస్. కల్పనను 99483 22446, 63052 08131 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.