NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 10:28 pm Posted by : NAMASTHE BHARAT

పిఆర్టీయూ రాష్ట్ర కమిటీలో మరిపెడకు పెద్దపీట

పిఆర్టీయూ రాష్ట్ర కమిటీలో మరిపెడకు పెద్దపీట

రాష్ట్రస్థాయి పదవులకు మరిపెడ మండలం నుంచి ఏడుగురు ఏకగ్రీవ ఎన్నిక

నమస్తే భారత్ :-మరిపెడ

జి.యం కన్వెన్షన్ హాల్ నల్గొండ రెండు రోజుల పాటు జరిగిన పిఆర్టీయూ 6వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో మరిపెడ మండలానికి చెందిన ఉపాధ్యాయుల ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పిఆర్టీయూ రాష్ట్ర సంఘ అధ్యక్షులు సుంకరి భిక్షం గౌడ్ తెలిపారు.రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా దోమల లింగయ్య,గండి కరుణాకర్,బయగాని రాంమోహన్,రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అబ్బూరి సునీల్ కుమార్,రాయిపెల్లి యాకయ్య, గుగులోత్ శ్రీధర్,రాష్ట్ర కార్యదర్శిగా బి. దత్తప్రసాద్ లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రాష్ట్ర బాధ్యులు మాట్లాడుతూ రాష్ట్ర శాఖలో తమకు ఉన్నతమైన గౌరవం, బాధ్యతలు లభించడం సంతోషంగా ఉందని తెలిపారు.తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని,విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఉపాధ్యాయులకు అండగా ఉంటామని పేర్కొన్నారు. సంఘ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తామని స్పష్టం చేశారు.నూతన రాష్ట్ర బాధ్యులను పిఆర్టీయూ మరిపెడ మండల శాఖ అధ్యక్షులు కీసర రమేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి లింగాల మహేష్ గౌడ్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘ బాధ్యులు అర్జున్ నాయక్,కృష్ణారెడ్డి,గుర్రం వెంకన్న,వెంకటయ్య,గుగులోత్ వెంకన్న,గుండ్ల వెంకన్న,రవి,యాదగిరి, భరత్, విజయ్.కుమార్,జగన్,శ్రీహరి,విజయ్ తదితరులు పాల్గొన్నారు.