ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
నమస్తే భారత్ :-తొర్రూరు
ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని మండల వ్యవసాయ అధికారి డి. రాంనర్సయ్య తెలిపారు.
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని.వెలికట్ట, గుర్తురు, వెంకటాపురం, బొంతుపల్లి, ఖానాపురం గ్రామాల్లో గురువారం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగు, పంట మార్పిడి విధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ.
ఈ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం వల్ల నీటి లభ్యత తగ్గినా లేదా వర్షపాతం హెచ్చుతగ్గులు ఉన్నా నష్టపోకుండా ఉండేందుకు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను.ఎంచుకోవాలన్నారుఎల్ నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదవుతుందని, ఈ పరిస్థితుల్లో రైతులు వరి సాగు చేయడం వల్ల ఆఖరి దశలో నీరందక నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.
పొలంలో తేమ నిల్వ ఉండేలా మల్చింగ్ లేదా ఇతర తేమ సంరక్షణ పద్ధతులు పాటించాలని పేర్కొన్నారు. డ్రిప్ లేదా స్ప్రింక్లర్ వంటి నీటి పొదుపు పద్ధతులు ఉపయోగిస్తే ప్రయోజనం ఉంటుందని రైతులకు సూచించారు.
రైతులు వాణిజ్య, సాంప్రదాయ పంటల స్థానంలో పెసర, మినుము, నువ్వులు, ఆముదాలు, కుసుమలు తదితర పంటలను సాగు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఈవోలు వినయ్ వర్మ, జమున , భరత్ చంద్ర, దీపిక, ప్రవీణ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.