NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 7:40 pm Posted by : NAMASTHE BHARAT

రైతులందరికీ పట్టాలు ఇవ్వాలి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ఆర్డీఓ ఉమారాణికి వినతిపత్రం

రైతులందరికీ పట్టాలు ఇవ్వాలి

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ఆర్డీఓ ఉమారాణికి వినతిపత్రం

నర్సంపేట, అక్టోబర్ 6 (మల్లేష్ ,నమస్తే భారత్ ) :

అర్హులైన ప్రతి రైతు భూమికి పట్టా పాస్‌బుక్ అందించాలని కోరుతూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ఆర్డీఓ ఉమారాణికి ఖానాపురం సోసైటీ చైర్‌పర్సన్ వల్లె శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైతులు వినతిపత్రం అందజేశారు.వరంగల్ జిల్లా ఖానాపురంమండలంలోని ధర్మారావుపేట,మంగళవారిపేట, బుదరావుపేట గ్రామాల్లోని రెవెన్యూ భూములకు సంబంధించి అర్హులైన రైతులందరికీ పట్టాలు మంజూరు చేయాలనిఈసందర్భంగా రైతులు కోరారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన ప్రతి రైతుకు పట్టా పాస్‌బుక్ అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా కన్వీనర్ నాంచారి కుమారస్వామి, గ్రామ పార్టీ అధ్యక్షులు ముదురు కుమారస్వామి, బొమ్మగాని నవీన్, నునావత్ మోహన్, దేవేందర్, , మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి పులిగిల్ల నాగరాజు యాదవ్,మాజీ ఎంపీటీసీ మూడు పుల్‌సింగ్, ఉపసర్పంచ్‌లు కొనకటి రాజు, భూషబోయిన రాజు , రైతులు తదితరులు పాల్గొన్నారు.