ఆకట్టుకున్న అక్షయ ఆహాభావాలు

ఆకట్టుకున్న అక్షయ ఆహాభావాలు నమస్తే భారత్ షాద్ నగర్,ఆగస్టు 16: కమనీయమైన ఆహా భావాలతో అక్షయ ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలంగాణ తల్లికి వందనం భరతమాతకు అభివందనం అంటూ 80వ స్వాతంత్ర వేడుకలు పురస్కరించుకొని తెలంగాణ కళా జాగృతి ఫౌండేషన్ ఆదివారం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో చిన్నారులతో నృత్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో షాద్నగర్ పట్టణానికి చెందిన నాట్య నివేదాలయం గురువు భార్గవి శిష్యురాలైన అక్షయ నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వందనీయ జనని...