NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 8:21 pm Posted by : NAMASTHE BHARAT

ఆకట్టుకున్న అక్షయ ఆహాభావాలు

ఆకట్టుకున్న అక్షయ ఆహాభావాలు

నమస్తే భారత్ షాద్ నగర్,ఆగస్టు 16: కమనీయమైన ఆహా భావాలతో అక్షయ ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలంగాణ తల్లికి వందనం భరతమాతకు అభివందనం అంటూ 80వ స్వాతంత్ర వేడుకలు పురస్కరించుకొని తెలంగాణ కళా జాగృతి ఫౌండేషన్ ఆదివారం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో చిన్నారులతో నృత్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో షాద్నగర్ పట్టణానికి చెందిన నాట్య నివేదాలయం గురువు భార్గవి శిష్యురాలైన అక్షయ నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వందనీయ జనని ఓ భారతి అనే గానం పై ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. నందిత, తేజశ్రీ, యుక్త, ప్రణవి, కల్పన, స్నేహ, సాయి సుదీక్ష, తను, ఆద్వితీ, చార్నవి మొదలగు చిన్నారులు తమ నృత్యాలతో పలువులి ప్రశంసలు పొందారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కళా జాగృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువు భార్గవి, చిన్నారులను మేమెంటో, ప్రశంసా పత్రాలతో సత్కరించి అభినందించారు.