*ఘనంగా ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం 91వ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు*


*భగత్ సింగ్ రాజ్ గురు సుకుదేవ్ ఆశయాలతో యువత ముందుకు సాగాలి*
*విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్*
*ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎం పవన్ చౌహన్*
*విద్యార్థులు అందరూ విద్యా పరిరక్షణకై ఉద్యమించాలి*
*షాద్నగర్ నియోజకవర్గం లో ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లకు సొంత భవనాలు నిర్మించాలి*
*ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాశ్ నాయక్*
నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 12: ఏఐఎస్ఎఫ్ 91 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాశ్ నాయక్ ఆధ్వర్యంలో షాద్ నగర్ పట్టణంలోని వీఐఐటి జేఈఈ అకాడమీ జూనియర్ కాలేజ్ లో ఘనంగా జండా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ఒక్క జెండా పండుగ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎం పవన్ చౌహాన్ పాల్గొని జెండాను ఎగరవేసి అనంతరం మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం అనేది 1936 ఆగస్టు 12న ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లోని లక్నో నగరం బెనారస్ విశ్వవిద్యాలయంలో స్వతంత్ర ఉద్యమంలో విద్యార్థులు ఉద్యమించినప్పటికీ దేశవ్యాప్తంగా జాతీయస్థాయిలో విద్యార్థి సంఘం అవసరమని భావించి ఉత్తరప్రదేశ్ డిగ్రీ విద్యార్థులు ప్రేమ నారాయణ భార్గవ్ బాబురుద్దీన్ లు కలిసి విద్యార్థి సంఘాన్ని స్థాపించారు నాటి నుండి నేటి వరకు విద్యార్థుల సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేస్తూ 90 సంవత్సరాలు పూర్తి చేసుకుని 91వ సంవత్సరంలో అడుగుపెడుతున్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ నాడు స్వతంత్ర ఉద్యమంలో నేడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని ప్రస్తావించారు విద్యార్థులందరూ ఏఐఎస్ఎఫ్ జెండా నీడన విద్యార్థుల హక్కులకై పోరాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకు అరటి పండ్లు పంపిణీ చేశారు.ఈ యొక్క కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్, హర్షిత్, సంతోష్ విద్యార్థి విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.