NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 11:56 am Posted by : NAMASTHE BHARAT

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులచే  ఏఐ శిక్షణ

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులచే ఏఐ శిక్షణ

నమస్తే భారత్ :-తొర్రూరు

తెలంగాణ విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్న అక్క ఏఐ మెంటార్ షిప్ కార్యక్రమాలు శుక్రవారం తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.రాములు మార్గదర్శకత్వంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలు ప్రారంభించారు.ఈ ప్రోగ్రాంలో శిక్షణ తీసుకున్న డిగ్రీ కళాశాల విద్యార్థులు పాఠశాల విద్యార్థులకు ఏఐ ,మిషన్ లెర్నింగ్ మరియు కోడింగ్ వంటి అంశాలను బోధించారు. ఈ సందర్భంగా జడ్పీహెచ్ఎస్ తొర్రూరు ప్రధానోపాధ్యాయులు జెల్లా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా అనేక సాంకేతిక నైపుణ్యాలను పెంచుటతోపాటు ఉపాధ్యాయులపై ఉన్న ఒత్తిడి కొంతవరకు తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్స్ రవీంద్రారెడ్డి,ఎస్.శ్రీనివాస్, డాక్టర్ సునీల్, విద్యార్థులు, అధ్యాపకులు, జడ్పిహెచ్ఎస్ భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.