NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 8:53 pm Posted by : NAMASTHE BHARAT

బూర్గుల రైతు వేదికలో వ్యవసాయ సాంకేతిక యజమాన్య సంస్థ

బూర్గుల రైతు వేదికలో వ్యవసాయ సాంకేతిక యజమాన్య సంస్థ

సేంద్రియ వ్యవసాయం పై శిక్షణ కార్యక్రమం

నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 11:బూర్గుల రైతు వేదికలో వ్యవసాయ సాంకేతిక యజమాన్య సంస్థ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయం పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది .ఇట్టి కార్యక్రమంలో వ్యవసాయ అధికారి నిశాంత్ కుమార్ మాట్లాడుతూ
*సేంద్రియ వ్యవసాయం* అంటే రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా ప్రకృతి సహజ పద్ధతులతో పంటలు పండించడం అని రైతులకు ఈ క్రింది సూచనలు చేయడం జరిగింది.
*ప్రధాన లక్షణాలు*
– *ఎరువులు*: పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్, పచ్చిరొట్ట ఎరువులు, జీవ ఎరువులు వాడతారు
– *పురుగు నియంత్రణ*: వేప పిండి, గోమూత్రం కషాయం, పసుపు, వేపనూనె వంటి సహజ పద్ధతులు
– *నీరు*: చుక్కల నీటి పారుదల, వర్షపు నీటి సంరక్షణ
– *భూమి ఆరోగ్యం*: పంట మార్పిడి, అంతర పంటలు, పచ్చిరొట్ట వేయడం

*సేంద్రియ వ్యవసాయం వల్ల లాభాలు*
1. *ఆరోగ్యం*: రసాయనాలు లేని ఆహారం, పోషకాలు ఎక్కువ
2. *నేల*: నేల సారవంతం పెరుగుతుంది, సూక్ష్మజీవులు బతుకుతాయి
3. *పర్యావరణం*: నీరు, గాలి కలుషితం కాదు. తేనెటీగలు, పక్షులు పెరుగుతాయి
4. *ఆదాయం*: మార్కెట్లో సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్, ధర ఎక్కువ అని తెలిపారు
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా రైతు శిక్షణ సంస్థ వ్యవసాయ అధికారి రజియా సుల్తానా,ఏ ఈ ఓ కిరణ్మయి ,బూర్గుల ఏ ఈ ఓ రాంబాబు ,ఆత్మ ఏటీఎంలు రవీందర్ ,వెంకటేష్ ,కడియలకుంట సర్పంచ్ రాజు నాయక్ ,కాశిరెడ్డి గూడా సర్పంచ్ రామలింగం గౌడ్ మరియు రైతులు పాల్గొన్నారు.