ప్రజావాణిలో వినతుల స్వీకరణ
ప్రజావాణిలో వినతుల స్వీకరణ దుండిగల్లో నాలుగు.. కొంపల్లి, గాజులరామారంలో ఒక్కో దరఖాస్తు.. త్వరిత పరిష్కారానికి ఆదేశాలు కుత్బుల్లాపూర్, జూలై 6 ( నమస్తే భారత్): ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టే లక్ష్యంతో కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని దుండిగల్ సర్కిల్–54, కొంపల్లి సర్కిల్–56, గాజులరామారం సర్కిల్–57 కార్యాలయాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖలకు పంపించి, నిర్ణీత గడువులో పరిష్కరించాలని డిప్యూటీ కమిషనర్లు అధికారులను ఆదేశించారు....