రాయదుర్గంలో గౌడల ఐక్యతకు నిదర్శనం

ఫంక్షన్ హాల్ ప్రారంభం.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ
కుత్బుల్లాపూర్, ఆగస్టు 5: ( నమస్తే భరత్ ); రాయదుర్గంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన నూతన ఫంక్షన్ హాల్‌ను ఘనంగా ప్రారంభించడంతో పాటు వీరయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌడ సమాజం ఐక్యంగా ఉండి విద్య, రాజకీయాలు, వ్యాపారం, సామాజిక సేవ తదితర రంగాల్లో మరింత పురోగతి సాధించాలని పిలుపునిచ్చారు. యువతకు అండగా నిలవాలని సమాజంలోని ప్రముఖులను కోరారు. సమిష్టి కృషితో ఫంక్షన్ హాల్ నిర్మించిన రాయదుర్గం గౌడ సంఘ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, పల్లె లక్ష్మణ్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్, నేమూరి రాములు గౌడ్ తదితర ప్రముఖులు, గౌడ సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.