NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 8:45 pm Posted by : NAMASTHE BHARAT

కోరుకొండ పల్లి గ్రామంలో ఘనంగా కుంకుమార్చన పూజకార్యక్రమం

కోరుకొండ పల్లి గ్రామంలో ఘనంగా కుంకుమార్చన పూజకార్యక్రమం

శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు

విగ్రహదాతగా గణనాథుని ప్రతిష్టించి ఉదారత చాటుకున్న సమ్మి గౌడ్

నమస్తే భారత్ :-కేసముద్రం

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని కోరుకొండపల్లి గ్రామంలో శ్రీ విఘ్నేశ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వినాయక స్వామివారి కుంకుమార్చన కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు.సమ్మి గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ స్వామివారికి కుంకుమార్చన సేవను నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ మండపంలో ప్రతిష్టించిన గణనాథుని విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమ్మి గౌడ్ గారే విగ్రహదాతగా సమర్పించడం విశేషం. స్వామివారి ఆశీస్సులతో మండల ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ బాధ్యులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు.