నూతన ఎస్ఐ బాణోతు వెంకన్నకు ఘన సన్మానం
మరిపెడ పట్టణ అధ్యక్షుడు పనుగోత్ రాంలాల్
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన బాణోతు వెంకన్నకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మరిపెడ పట్టణ అధ్యక్షుడు పనుగోత్ రాంలాల్ నూతన ఎస్ఐ బాణోతు వెంకన్నకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మరిపెడ పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన బాణోతు వెంకన్నకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. మరిపెడ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు ఆయన కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలు, పోలీసుల మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయాలని కోరారు.
అలాగే మరిపెడ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ.సంఘటనలు.చోటుచేసుకోకుండా శాంతియుత వాతావరణం నెలకొనేలా.చర్యలు.తీసుకోవాలని.అభిప్రాయపడ్డారు. నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన బాణోతు వెంకన్నకు స్థానిక నాయకులు తమ అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అంబరీష్, మెంచు అశోక్, కోఆప్షన్ సభ్యులు గుండగాని వెంకన్న, సయ్యద్ సర్వర్ భాయ్ తదితరులు పాల్గొన్నారు.