NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 8:12 pm Posted by : NAMASTHE BHARAT

వినాయక చవితి సందర్భంగా 3వ వార్డులో ఘనంగా అన్నదానం కార్యక్రమం

వినాయక చవితి సందర్భంగా 3వ వార్డులో ఘనంగా అన్నదానం కార్యక్రమం

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా మున్సిపాలిటీ 3వ వార్డులో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు మరియు స్థానిక.ప్రజలకు.అన్నప్రసాదాన్ని అందజేశారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమానికి స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు.ఈ కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ పానుబోతు రాములు, సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్, మాజీ కోఆప్షన్ సభ్యులు హుస్సేన్, కోటి రెడ్డి, రహీముద్దీన్, సుధాకర్ రెడ్డి, నర్సిరెడ్డి, జగన్ రెడ్డి, యాకయ్య, రమేష్, కొండ వెంకన్న, సత్యం, సుధాకర్, రాజు, రాజేష్, సాయి, చింటూ, బాబా, సోహెల్, అష్రఫ్ తదితరులు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి వంటి పర్వదినాల్లో అన్నదానం చేయడం గొప్ప సేవా కార్యక్రమమని, భక్తులకు అన్నప్రసాదం అందించడం ద్వారా సేవాభావాన్ని చాటుకోవడంతో పాటు ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం మరింత బలపడతాయని అన్నారు. పండుగలను భక్తిశ్రద్ధలతో, అందరి సహకారంతో నిర్వహించడం ద్వారా ఆధ్యాత్మికతతో పాటు సామాజిక ఐక్యత కూడా పెంపొందుతుందని తెలిపారు.
వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక యువకులు సమన్వయంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం ప్రశాంతంగా, ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.