రంగాపురం గ్రామంలో భూ రీ సర్వే భాగంగా గ్రామ సభ నిర్వహించిన
డివిజన్ ఇన్స్పెక్టర్ లూర్దూ, మండల తహసిల్దార్ వివేక్.
నమస్తే భారత్ :-కేసముద్రం
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం రంగాపురం గ్రామపంచాయతీ కార్యాలయం నందు భూముల రీ-సర్వే గురించి గ్రామసభ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భూ రికార్డుల కార్యాలయ డివిజన్ ఇన్స్పెక్టర్ లుర్దూ, తహసిల్దార్ వివేక్ మాట్లాడుతూ గత 90 సంవత్సరాలుగా మన తెలంగాణ రాష్ట్రంలో భూములకు ఎలాంటి సర్వేలు నిర్వహించలేదు. ఆ కాలంలో నిజాం రాజులు ఈ సర్వే మొదలుపెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భూముల రీ సర్వే నిర్వహించడం మొదలుపెట్టారు. గ్రామంలో మొత్తం ఎంజాయ్మెంట్ సర్వే చేసి ఉక్కులు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎలాంటి సమస్యలు లేకుండా మండల సర్వేయర్ ఆధ్వర్యంలో లైసెన్స్ సర్వేయర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, గ్రామంలో ఎంచు భూమి వదలకుండా సర్వే చేసి మీకు పట్టా పాస్బుక్కులు ఇవ్వడం జరుగుతుంది. అడవి భూములు ఉన్న, ఆర్ ఓ ఆర్ పట్టాలు ఉన్న, గత కొన్ని సంవత్సరాలుగా మీకు పట్టా లేని భూములు, పార భూములకు రిజిస్ట్రేషన్ ఇలాంటి సమస్యలకు ఈ భూముల రీ సర్వే చాలా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో భూ రికార్డుల సర్వే కార్యాలయ డివిజన్ ఇన్స్పెక్టర్ లూర్దూ, మండల తహసిల్దార్ వివేక్, మండల సర్వేయర్, గ్రామ సర్పంచ్ భారతమ్మ, జిపిఓ పుష్పలత, ఏఈఓ సాయి చరణ్, ఉపసర్పంచ్ జనార్దన్, వార్డ్ మెంబర్లు, గ్రామ ప్రజలు తదితరులు.పాల్గొన్నారు.