ePaper
Sunday, November 15, 2026
ePaper
Homeతెలంగాణగుడుంబాను ఉక్కు పాదంతో నిర్మూలిస్తాం

గుడుంబాను ఉక్కు పాదంతో నిర్మూలిస్తాం

📰 Generate e-Paper Clip

గుడుంబాను ఉక్కు పాదంతో నిర్మూలిస్తాం

ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.నవీన్ కుమార్

తొర్రూరు,నెల్లికుదురు, మరిపెడ మండలాల్లో ఎక్సైజ్ విస్తృత దాడులు

నమస్తే భారత్ :-తొర్రూరు

గుడుంబా రహిత గ్రామాలే లక్ష్యంతో గుడుంబాను ఉక్కు పాదంతో నిర్మూలిస్తామని ఎక్సైజ్ శాఖ వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ కె.నవీన్ కుమార్ తెలిపారు. గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్, ఎన్ ఫోర్స్మెంట్ పోలీసులు శుక్ర, శని వారాల్లో దాడులు నిర్వహించారు. గుడుంబా తయారీకి వినియోగించే పదార్థాలను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు.
ఎన్ ఫోర్స్ మెంట్ వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ కే. నవీన్ కుమార్, ఏఈఎస్ బ్రహ్మానంద రెడ్డి,ట్రైనీ ఏఈఎస్ వి. లక్ష్మణ్ ఆనంద్,తొర్రూరు ఎక్సైజ్ సీఐ బూస అశోక్ లతో పాటు పలువురు అధికారులు తొర్రూర్ సర్కిల్ పరిధిలో నిర్వహించిన దాడుల్లో పాల్గొన్నారు.
శనివారం డివిజన్ కేంద్రంలోని
ఎక్సైజ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ.ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎక్సైజ్, టాస్క్ ఫోర్స్, సివిల్ పోలీస్ సహకారంతో జిల్లా వ్యాప్తంగా గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించామన్నారు.తొర్రూరు, మహబూబాబాద్ సర్కిల్ పరిధిలో 22 బృందాలు ఏర్పాటు చేశామన్నారు. 22 తండాల్లో దాడులు నిర్వహించి 64 కేసులు నమోదు చేశామని,36 మందిని అరెస్టు చేశామన్నారు.217 లీటర్ల గుడుంబా,9450 లీటర్ల బెల్లం పానకం,565 కేజీల పట్టిక,6 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని,తొర్రూరు డివిజన్ పరిధిలోని.తొర్రూరు,మరిపెడ,నెల్లికుదురు మండలాల్లో దాడులు నిర్వహించామని తెలిపారు.ఈ దాడుల్లో 109 లీటర్ల నాటుసారా,4 క్వింటాళ్ల నల్ల బెల్లం,3400 లీటర్ల బెల్లం పానకం, 20 కిలోల పట్టిక, 250 కిలోల చక్కెర,2.50 కిలోల ఈస్ట్ పౌడర్ లతో పాటు 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.30 మందిపై కేసులు నమోదు చేయడంతో పాటు,19 మందిని అరెస్టు చేశామన్నారు.40 మందిని తహసిల్దారుల ఎదుట బైండోవర్ చేశారు.ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కె.నవీన్ కుమార్ మాట్లాడుతూ.సారా తయారీకి వినియోగించే బెల్లం, ఇతర ముడి పదార్థాల క్రయవిక్రయాలు, రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గుడుంబా కేసుల్లో పట్టుబడితే పీడీ యాక్టు నమోదు చేస్తామని, సంక్షేమ పథకాలు రాకుండా.చేస్తామని,జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తామని తెలిపారు. గుడుంబా ఆనవాళ్లు లేకుండా చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని,గుడుంబా నిర్మూలనకు ప్రజలంతా సహకరించాలని కోరారు.ఈ దాడుల్లో ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ హరి, టాస్క్ ఫోర్స్ ఆర్. రంగనాథ్, ఎక్సైజ్ సిఐలు ఆర్. రంగనాథ్, గురునాథ్,ఎస్సైలు మహేందర్ రెడ్డి,ఖాదర్ పాషా,కరుణాకర్, పవన్ కుమార్,వెంకన్న, కరుణాకర్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!