మసీదు సెంటర్లో పోలీసుల వాహన తనిఖీలు పాల్గొన్న ఎస్ఐ కుటుంబరావు
జంగారెడ్డిగూడెం నమస్తే భారత్ నవంబరు 14 ప్రేమ్ కిరణ్
పట్టణంలోని మసీదు సెంటర్లో ఎస్ఐ కుటుంబరావు ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాహనాలకు సంబంధించిన సరైన రికార్డులు, ధ్రువపత్రాలు లేని వాహనదారులను గుర్తించి, వారికి వాహన పత్రాలు లేకపోవడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు, చట్టపరమైన పరిణామాలపై ఎస్ ఐ కుటుంబరావు అవగాహన కల్పించారు. నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరైన రికార్డులు లేని వాహనాలకు జరిమానాలు విధించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా సూచించారు



