ePaper
Sunday, November 15, 2026
ePaper
Homeఎడిటోరియల్తీన్మార్ మల్లన్న కారును లారీ ఢీకొనడంలో పలు అనుమానాలు

తీన్మార్ మల్లన్న కారును లారీ ఢీకొనడంలో పలు అనుమానాలు

📰 Generate e-Paper Clip

*తీన్మార్ మల్లన్న కారును లారీ ఢీకొనడంలో పలు అనుమానాలు*

*విచారణను హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపలి*

*నిజానిజాలను తేల్చాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ – టిఆర్పి షాద్ నగర్ ఇన్చార్జ్ ఎమ్మె సంతోష్*

నమస్తే భారత్ షాద్ నగర్,నవంబర్13:షాద్ నగర్ లోని టిఆర్పి కార్యాలయంలో షాద్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులు ఎమ్మె సంతోష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ…తీన్మార్ మల్లన్న కారును లారీ ఢీకొనడంలో పలు అనుమానాలు ఉన్న కారణంగా ఇట్టి విచారణను హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపి నిజానిజాలను తేల్చాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడమైనది
తీన్మార్ మల్లన్న మహా పాదయాత్ర మోత్కూర్ నుండి తిరుమలగిరి వెళ్తున్న తరుణంలో అనాజీపూర్ వద్ద అతివేగంగా వస్తున్న లారీ తీన్మార్ మల్లన్న ఫార్చునర్ కారును వెనుక నుండి ఢీకొనడం జరిగింది అలాగే ముందు మరక షిఫ్ట్ కార్లు కూడా ఢీకొనడం జరిగింది ఆ రెండు కార్లల్లో ఉన్న వ్యక్తులకు తీర్వ గాయాలతో పరిస్థితి విషమంగా ఉన్నది . మరియు అతివేగంగా ఉన్నటువంటి లారీ అదుపుతప్పి అక్కడ పాదయాత్ర చేస్తున్న తీన్మార్ మల్లన్న మరియు టిఆర్పి నాయకుల, కార్యకర్తల పైకి వెళితే వందల సంఖ్యలో దుర్మరణలు ఉండే పరిస్థితి ఆ ఆక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే లారీ దిగి ఒక నల్లటి పార్ట్నర్ కారులో పారిపోయినట్టుగా అక్కడి స్థానికులు మరియు ప్రత్యక్ష సాక్షులు తెలపడం జరిగింది కావున ఇట్టి ప్రమాదంపై అనేక అనుమానాలు మరియు కుట్రలు ఉన్న కారణంగా ఈ ప్రమాదాన్ని వీలైనంత వెంటనే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు సిట్టింగ్ జర్జితో విచారణ జరిపించి నిజ నిజాలు తెలుపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమైనది. అదేవిధంగా ఈరోజు తీన్మార్ మల్లన్న కి ఏదైనా ప్రమాదం జరిగితే రాష్ట్రంలో ఉన్న బీసీలు ఆగ్రహానికి గురికావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కావున ఇప్పటికైనా పాదయాత్రకు మరియు తీన్మార్ మల్లన్నకి రాష్ట్ర ప్రభుత్వము భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉందని హెచ్చరించడం అయినది ఈ కార్యక్రమంలో షాద్నగర్ నియోజకవర్గ అధ్యక్షులు ఎమ్మ సంతోష్ మహిళా అధ్యక్షురాలు గుల్ల లక్ష్మి ఉపాధ్యక్షులు మీదికే రాధాకృష్ణ గుంటి శంకర్ ఉపాధ్యక్షురాలు యాదమ్మ జిల్లా నాయకులు గుల్ల శ్రీనివాస్, షాద్నగర్ మున్సిపాలిటీ అధ్యక్షులు ఉప్పరమొని రాములు, యాదగిరి,గోపాల్ హరిప్రసాద్ వడ్డే శంకర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!