ePaper
Sunday, November 15, 2026
ePaper
Homeతెలంగాణబాల్యవివాహాలు,పోక్సోచట్టం, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు పాల్గొన్న పట్టణ సీఐ సీతారాం

బాల్యవివాహాలు,పోక్సోచట్టం, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు పాల్గొన్న పట్టణ సీఐ సీతారాం

📰 Generate e-Paper Clip

*బాల్యవివాహాలు,పోక్సోచట్టం, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు పాల్గొన్న పట్టణ సీఐ సీతారాం*

నమస్తే భారత్ షాద్ నగర్ ,నవంబర్13:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బాల్యవివాహాల నిరోధం,బాలలపై లైంగిక వేధింపుల నివారణ,సైబర్ నేరాల పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు షాద్‌నగర్ పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.పోలీస్ కమిషనర్ (సీపీ) ఆదేశాల మేరకు,డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ),షాద్‌నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) మార్గదర్శకత్వం,పర్యవేక్షణలో శుక్రవారం ఫరూఖ్‌నగర్ మండలం కమ్మదనం గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ముఖ్యఅతిథిగా పట్టణ సీఐ సీతారాం పాల్గొన్నారు.సీఐ మాట్లాడుతూ,, ఈ సందర్భంగా విద్యార్థులకు బాల్యవివాహాల నిరోధక చట్టం, బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలు,చట్టపరమైన పరిణామాలను వివరించారు.
బాలబాలికలకు వివాహానికి నిర్దేశించిన చట్టబద్ధమైన వయస్సుపై అవగాహన కల్పించారు.ఎక్కడైనా బాల్యవివాహాలు జరిగే ప్రయత్నాలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.అలాగే బాలలపై లైంగిక నేరాల నుంచి రక్షణ కల్పించే పోక్సో చట్టంలోని నిబంధనలు,గుడ్ టచ్,బ్యాడ్ టచ్,వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అంశాలను వివరించారు. ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడితే భయపడకుండా, సంకోచించకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని విద్యార్థులకు సూచించారు.ప్రస్తుత డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై కూడా విద్యార్థులను అప్రమత్తం చేశారు.నకిలీ సోషల్ మీడియా ఖాతాలు,ఆన్‌లైన్ మోసాలు, సైబర్ వేధింపులు,ఓటీపీ, పాస్‌వర్డ్‌ల భద్రత గురించి వివరించారు.వ్యక్తిగత ఫొటోలు, సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని,సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.విద్యార్థులు తమ చట్టపరమైన హక్కులపై అవగాహన కలిగి ఉండటంతో పాటు వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇతరులను గౌరవించాలని పోలీసులు తెలిపారు.ఏదైనా సమస్య ఎదురైనా,చట్టవిరుద్ధ కార్యకలాపాలు గుర్తించినా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు.విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన పెంపొందించడం,బాలల హక్కులు,భద్రతపై చైతన్యం కల్పించడం,బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!