ePaper
Saturday, November 14, 2026
ePaper
Homeతెలంగాణవిద్యార్థులకు చదువుతో పాటు రుచికరమైన భోజనాన్ని అందించాలి: బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ...

విద్యార్థులకు చదువుతో పాటు రుచికరమైన భోజనాన్ని అందించాలి: బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ …

📰 Generate e-Paper Clip

*_విద్యార్థులకు చదువుతో పాటు రుచికరమైన భోజనాన్ని అందించాలి: బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ …

నమస్తే భారత్ /కుత్బుల్లాపూర్ నియోజక వర్గం* గురువారం సీఎంసీ దుండిగల్ సర్కిల్ పరిధి దుండిగల్ తండా– 1 లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నూతనంగా నిర్మించిన వంటశాలను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విద్యార్థులకు మంచి చదువుతోపాటు పాఠశాల అభివృద్ధిలో భాగంగా వంటశాల మరియు భోజన శాలలను నిర్మించి విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందిస్తున్న మోల్డ్ టెక్ కంపెనీ యాజమాన్యానికి, పాఠశాల అధ్యాపక బృందానికి నా అభినందనలు. వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణకు అనుగుణంగా రానున్న రోజుల్లో దుండిగల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో భీమ్ సింగ్ ప్రవీణ్ గడిల, నాయకులు & మాజీ కౌన్సిలర్లు శంభీపూర్ క్రిష్ణ, గోపాల్ రెడ్డి, జగన్ నాయక్, మహేందర్ నాయక్, కొల్తూరి మల్లేష్, జక్కుల శ్రీనివాస్ యాదవ్, విద్యారి విభాగం నాయకులు ప్రవీణ్ నాయక్, బాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!