ePaper
Thursday, November 5, 2026
ePaper
Homeతెలంగాణ*తుగ్గలి మండలంలో విషాదం*

*తుగ్గలి మండలంలో విషాదం*

📰 Generate e-Paper Clip

*తుగ్గలి మండలంలో విషాదం*

* విద్యుత్ స్తంభం పడి చెన్నంపల్లి వాసి మృతి,మరొకరి పరిస్థితి విషమం.

తుగ్గలి నవంబర్ 5( నమస్తే భరత్): తుగ్గలి మండల పరిధిలోని గల చెన్నంపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గురువారం రోజున గుత్తి ఆర్ఎస్ పట్టణం నందు మంత్రాలయం నుండి బెంగళూరుకు వెళ్తున్న కారు డివైడర్ పైకి ఎక్కి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో,విద్యుత్ స్తంభం ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం మీద పడి చెన్నంపల్లి గ్రామానికి చెందిన భాస్కర్ గౌడ్ మృతి చెందారు.అదే ఘటనలో వెంకన్న తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం.గాయపడిన వెంకన్నను హుటాహుటిన అనంతపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనతో చెన్నంపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.భాస్కర్ గౌడ్ మృతితో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.ఈ ఘటనపై సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు గ్రామస్తులు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!