ePaper
Thursday, November 5, 2026
ePaper
Homeతెలంగాణ*రాతన సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం*

*రాతన సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం*

📰 Generate e-Paper Clip

*రాతన సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం*

* బొలెరో ఢీకొని పెరవలి వాసి అక్కడికక్కడే మృతి.

తుగ్గలి నవంబర్ 5( నమస్తే భారత్): తుగ్గలి మండల పరిధిలోని గల రాతన ఆశ్రమ పాఠశాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం గురువారం రోజున చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో పెరవలి గ్రామానికి చెందిన గొల్ల సుంకన్న (35) సన్నాఫ్ జర్రప్ప అక్కడికక్కడే మృతి చెందారు.ద్విచక్ర వాహనంపై ఆదోని నుండి పెరవలి గ్రామానికి తిరిగి వస్తుండగా రాతన ఆశ్రమ పాఠశాల సమీపంలో కొలిమిగుండ్ల నుండి రాతన గ్రామానికి వెళ్తున్న బొలెరో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో సుంకన్న అక్కడికక్కడే మృతి చెందినట్లు తుగ్గలి ఎస్సై బాల నరసింహులు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!