*తుగ్గలిలో ఓటు వేసిన ప్రధాన పార్టీల ఎంపీటీసీ అభ్యర్థులు*
తుగ్గలి నవంబర్ 5( నమస్తే భరత్ ):మండల కేంద్రమైన తుగ్గలిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా,ఉత్సాహంగా సాగుతోంది.తుగ్గలి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి వరలక్ష్మి,తుగ్గలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి వింధ్య వాసిని తుగ్గలిలోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఓటు వేసిన అనంతరం ఇరువురు అభ్యర్థులు తమ సిరా వేలు చూపుతూ అభిమానులు,కార్యకర్తలతో కలిసి ఫోటోలు దిగారు.ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని,గ్రామ అభివృద్ధికి ఓటు వేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. పటిష్ట పోలీసుల బందోబస్తు మధ్య పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు బారులు తీరి ప్రశాంతంగా ఉత్సాహంగా ఓటు వేశారు.



