ePaper
Tuesday, November 3, 2026
ePaper
Homeతెలంగాణఅసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ADE) విద్యుత్ శాఖ కు వినతిపత్రం

అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ADE) విద్యుత్ శాఖ కు వినతిపత్రం

📰 Generate e-Paper Clip

అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ADE)
విద్యుత్ శాఖ కు వినతిపత్రం

నమస్తే భారత్ నవంబర్ 03.ఉట్కూర్ మండలం..

కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నూతనంగా వేసిన బోర్లకు 25 HP ట్రాన్స్‌ఫార్మర్ మరియు 10 విద్యుత్ స్తంభాలు మంజూరు చేయవలసిందిగా వినతి.నారాయణపేట జిల్లా, ఉట్కూర్ మండలం, కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన ఆర్. నర్సిములు, గ్రామ ప్రజల తరఫున విన్నవించునది ఏమనగా,మా కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో భవిష్యత్తులో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నూతనంగా బోర్లు వేయించడం జరిగింది.అయితే ఈ బోర్లను వినియోగంలోకి తీసుకురావడానికి అవసరమైన విద్యుత్ సౌకర్యం కల్పించాల్సి ఉంది. కావున గ్రామ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని, బోర్లకు విద్యుత్ సరఫరా అందించేందుకు 25 HP సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్ మరియు 10 విద్యుత్ స్తంభాలు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాము.గ్రామ ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించడంలో ఈ విద్యుత్ సౌకర్యం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.కావున మా గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, వీలైనంత త్వరగా ట్రాన్స్‌ఫార్మర్ మరియు విద్యుత్ స్తంభాలు మంజూరు చేసి బోర్లకు విద్యుత్ కనెక్షన్ కల్పించవలసిందిగా వినమ్రంగా ప్రార్థిస్తున్నాము.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!