ePaper
Tuesday, November 3, 2026
ePaper
Homeఎడిటోరియల్*చూసినోళ్లంతా నెత్తికి చేతులు పెట్టుకోక తప్పలేదు..*

*చూసినోళ్లంతా నెత్తికి చేతులు పెట్టుకోక తప్పలేదు..*

📰 Generate e-Paper Clip

*చూసినోళ్లంతా నెత్తికి చేతులు పెట్టుకోక తప్పలేదు..*

*శవం ముందు కూడా మీ ఇగోలేనా..? అణగారిన వర్గాల ఐక్యత సాధించేది ఇలాగేనా..?*

*అణగారిన వర్గాల ఐక్యత మాటల్లో కాదు.. చేతల్లో చూపించండి!*

*బాధిత కుటుంబం కాళ్లు పట్టుకునే పరిస్థితి తెచ్చిన మీ ఆధిపత్య పోరాటాలు సిగ్గుచేటు!*

నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్ 03:అమ్మాయి చనిపోయి మూడు రోజులైంది.. కుటుంబం కన్నీరుమున్నీరవుతుంటే మీ సంఘాల పంచాయితీలు ఏంటి..?ఐక్యత గురించి మాట్లాడే మనలోనే ఇంత ఇగో, వివక్షత ఉంటే అణగారిన వర్గాలు ఐక్యమయ్యేది ఎప్పుడు..?షాద్‌నగర్‌కు చెందిన విద్యార్థిని చంద్రకళ ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. ఒక పేద కుటుంబానికి చెందిన అమ్మాయి ఉన్నత చదువులు చదువుతూ భవిష్యత్తులో కుటుంబానికి అండగా నిలుస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది.అయితే ఈ విషాద ఘటనలో నన్ను మరింత కలచివేసిన విషయం మరొకటి.అమ్మాయి చనిపోయి మూడు రోజులవుతోంది. కుటుంబాన్ని పరామర్శించడానికి, ఆ అమ్మాయిని ఆఖరిచూపు చూడటానికి బంధువులు, వివిధ సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు వస్తుంటారు. ఇలాంటి సమయంలో బాధిత కుటుంబానికి మనం అండగా నిలబడాలి. వారి బాధను అర్థం చేసుకోవాలి. వారికి మనోధైర్యం కల్పించాలి.కానీ అక్కడ జరిగిన పరిణామాలు చూస్తుంటే బాధేస్తోంది. ఒక సంఘానికి చెందిన నాయకులు పని గట్టుకొని అక్కడే 20 నుంచి 30 నిమిషాల పాటు నిలబడటం, దానిపై మరో సంఘానికి చెందిన నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం, ఇరువర్గాల మధ్య బలమైన వాగ్వివాదం చోటుచేసుకోవడం జరిగింది. పరిస్థితి కొద్దిసేపు ఉంటే ఘర్షణకు దారితీసేలా కనిపించింది చివరికి కుటుంబ సభ్యులే సహనం కోల్పోయి కాళ్లు పట్టుకొని వేడుకునే పరిస్థితి వచ్చింది.“మా అమ్మాయి చనిపోయి మేము పుట్టెడు దుఃఖంలో ఉంటే.. మా ఇంటి దగ్గర మీ పంచాయితీలు ఏంటి? మీ గొడవలు ఏంటి?” అంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా నెత్తికి చేతులు పెట్టుకోక తప్పలేదు ఇది మనం ఆలోచించాల్సిన సమయం!ఒక కుటుంబం కన్నీళ్లలో ఉంటే మనం మన ఆధిపత్యాన్ని చూపించుకోవాలా? బాధిత కుటుంబం ముందు మన సంఘాల పేర్లు, మన వ్యక్తిగత ఇగోలు, మన మధ్య ఉన్న విభేదాలు అంత ముఖ్యమా?అణగారిన వర్గాల ఐక్యత కావాలని మాట్లాడుతున్నాం. అట్టడుగు వర్గాల హక్కుల కోసం పోరాడుతున్నామని చెబుతున్నాం. కానీ మన మధ్యనే ఇంతటి ఇగోలు, వివక్షత, ఆధిపత్య పోరాటాలు ఉంటే మనం ఎప్పుడు ఐక్యమవుతాం? మన హక్కుల కోసం కలిసి పోరాడేది ఎప్పుడు?మనం మారాలి.. మన ఆలోచనా విధానం మారాలి.ఒకరి బాధలో మరొకరం భాగస్వాములం కావాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. సంఘాల మధ్య పోటీ కంటే సమాజ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలి.చంద్రకళ లాంటి మరో బిడ్డను కోల్పోకుండా యువతకు అండగా నిలబడటం మనందరి బాధ్యత. ఇలాంటి విషాద సమయంలోనైనా మన విభేదాలను పక్కనపెట్టి బాధిత కుటుంబానికి అండగా నిలుద్దాం.ఒక్కసారి ఆలోచించండి.. మన మధ్యనే మనం కొట్టుకుంటే మన హక్కుల కోసం మనతో కలిసి పోరాడేది ఎవరు?

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!