ePaper
Sunday, October 18, 2026
ePaper
Homeతెలంగాణఅబ్దుల్ కలాం జయంతి సందర్బంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం విజయవంతం

అబ్దుల్ కలాం జయంతి సందర్బంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం విజయవంతం

📰 Generate e-Paper Clip

అబ్దుల్ కలాం జయంతి సందర్బంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం విజయవంతం

హనుమకొండ అక్టోబర్ 15 (నమస్తే భారత్ ) :
భారత క్షిపణి పితామహుడు , మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం జయంతి ని పురస్కరించుకొని గురువారం అబ్దుల్ కలాం ఫౌండేషన్ వ్యవస్థాపకులు దేవునూరి ఆనంద్ ఆధ్వర్యంలో స్థానిక రెడ్ క్రాస్ సొసైటీ సమావేశం మందిరంలో పెద్ది ఆంజనేయులు అధ్యక్షతన వివిధ రంగాలలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తు ఉపాధ్యాయులకు, సామాజిక సేవకులకు (22 మంది) కి కలాం ఎక్సలెన్స్ అవార్డ్స్ – 2026, ఆపద కాల సమయంలో ఎక్కువ సార్లు రక్తదానం చేసిన (23 మంది) కి ఎ.పి.జె. అబ్దుల్ కలాం లైఫ్ సేవర్ అవార్డు – 2026 అవార్డులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు హనుమకొండ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ డీటీఓ ఆకవరం శ్రీనివాస్ కుమార్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ విజయ చందర్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ది వెంకట్ నారాయణ గౌడ్ లతో కలిసి అబ్దుల్ కలాం గారికి పూలమాలలు వేయడం జరిగింది. అనంతరం తలసేమియా చిన్నారుల కోసం యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ మరియు ఏ.పి.జె. అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ” ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా 33 మంది రక్తదాతలు పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. హనుమకొండ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ డీటీఓ ఆకవరం శ్రీనివాస్ కుమార్ హాజరై మాట్లాడుతూ మామూలు పేద కుటుంబంలో జన్మించి పేపర్ బాయ్ గా పనిచేసి రాష్ట్రపతిగా ఎన్నికై దేశ అభివృద్ధికి ఎనలేని సేవలందించారని మనమందరం వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని వారి బాటలో నడవాలని సూచించారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికీ ప్రత్యేక అభినందనలు. ఈ కార్యక్రమంలో కలాం ఫౌండేషన్ ఫౌండర్ ఆనంద్ దేవూనూరి, కలాం ఫౌండేషన్ కో వ్యవస్థాపకుడు జిమ్మల వీరారెడ్డి, యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ అధ్యక్షులు కొత్తకొండ అరుణ్ కుమార్, బ్లడ్ డోనర్ అండ్ బ్లడ్ మోటివేటర్, వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు(స్విమ్మర్ రాజు), గంగోజుల నరేష్ జనగామ జిల్లా బాధ్యులు మీసాల సుధాకర్ ములుగు జిల్లా బాధ్యులు ఇజ్జగిరి ఆగయ్య కనకరాజు వెంకటరమణ సుధీర్ అయిత శ్రీనివాస్ మిమిక్రీ అంజన్ కుమార్ వేణుగోపాల్ పిన్నింటి బాలాజీ, రాజ్ కుమార్ , బొట్టు కమలాకర్, గజ్జెల సుమన్, ఊరటి రవికుమార్, పల్లె రాజి రెడ్డి, మునిగాల రాంప్రసాద్,ఉప్పరపల్లి రాజ్ కుమార్ , ముస్తఫా రక్తదాతలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!