*జూరాల ఎడమ కాలువకు సాగునీరు విడుదల చేయాలని ఆత్మకూర్ అమరచింత బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జూరాల ప్రాజెక్టుపై ధర్నా*
నమస్తే భరత్,, 19/9/2026/
*గత 10 రోజుల నుంచి ఎడమ కాలువకు సాగునీరు వదలకపోవడంతో బగ్గుమన్న బిజెపి పార్టీ*
*పంటలు ఎండుతున్న పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం*
*దాదాపు ఎర్రటి ఎండలో 4 గంటలు ధర్నా నిర్వహించిన బిజెపి పార్టీ*
*నీళ్లు వదులుతామని ఇరిగేషన్ అధికారులు విన్నపించడంతో విరమించిన ధర్నా*
*ఈరోజు జూరాల డ్యాం పై బీజేపీ పార్టీ నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో బిజెపి నాయకులు రైతులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు కొండన్నగారు మాట్లాడుతూ ఎల్ నీ నో ప్రభావం ఉన్న వర్షాలు పడవు అని వాతావరణ శాఖ తెలిసిన కూడా కాంగ్రెస్ నాయకులు ముందుచూపు లేకుండా నీళ్లు పుష్కలంగా ఉన్నాయని చెప్పి రైతులను పంటలు వేసుకున్న తర్వాత నీళ్లు వదలకుండా ఉండటాని ఖండించారు మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు రైతుల పంటలు ఎండిపోకుండా నీళ్లు అందించాలని హెచ్చరించారు*
*రాష్ట్ర నాయకులు అయ్యగారు ప్రభాకర్ రెడ్డి గారు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కోయిల్ సాగర్ సంఘం బండ బూత్పూర్ ఇతర రిజర్వాయర్లకు నీళ్లు వెళుతుంటే ప్రాజెక్టుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆత్మకూరు అమరచింత పరిధిలోని పంటలకు నీళ్లు పొదలకపోవడం విడ్డూరమని ఇరిగేషన్ అధికారులపై మండిపడ్డారు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి పంటలు వేసిన రైతులను నష్టపరచడం సరికాదని వెంటనే నీరు వదలని లేనిపక్షాన నీటి పారుదల శాఖ మంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని హెచ్చరించారు*
*ఆత్మకూరు ఫ్లోర్ లీడర్ అశ్విన్ కుమార్ గారు మాట్లాడుతూ ప్రాజెక్టులో 8 టీఎంసీల నీళ్లు ఉన్నప్పటికీ నీరు ఎందుకు వదలడం లేదని గత 30 సంవత్సరాల్లో ఇలాంటి దుస్థితి ఎప్పుడు రాలేదని రైతులు వరి పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు*
*ఆత్మకూరు మండల అధ్యక్షుడు అశోక్ భూపాల్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి రైతులను మోసం చేస్తుందని ఇప్పటికీ రైతు భరోసా కొనుగోలు చేసిన వడ్లకు బోనస్, రైతు బీమా, సబ్సిడీ విత్తనాలు పరికరాలు, ప్రధానమంత్రి ఫజల్ బీమా యోజన, అన్ని ఎత్తేసింది చాలాదన్నట్టు ఇప్పుడు రైతుల పంటలకు నీళ్లు వదలకపోవడం బాధాకరమని రైతుల కన్నీటి కష్టాలు పాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని హెచ్చరించారు*
*వెంటనే అక్కడికి వచ్చిన ఇరిగేషన్ ఏ ఈ వంశీకృష్ణ గారు పై స్థాయి అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరలో నీళ్లు పంటలకు వదులుతామని చెప్పడంతో అప్పటికే వాహనాలు మొత్తం స్తభించిపోయి ఎండలో ప్రజలు ఇబ్బంది పడడంతో బిజెపి నాయకులు ధర్నాలు విరమించడం జరిగింది*
*ఇట్టి కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు బి కొండన్న గారు, అయ్యగారు ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా ఉపాధ్యక్షుడు మేరవ రాజుగారు కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆత్మకూరు మాజీ ఫ్లోర్ లీడర్ అశ్విన్ కుమార్ గారు మక్తల్ కాన్స్టెన్సీ కో కన్వీనర్ రేచింతల శ్రీనివాస్ శ్రీనివాసులు గారు ఆత్మకూరు అమరచింత మండల అధ్యక్షులు అశోక్ భూపాల్ యాదవ్ గారు, మల్లారెడ్డి గారు, మంగ లావణ్య గారు, ఉప సర్పంచ్ ఎల్లన్న గారు,కిసాన్ మోర్చా అధ్యక్షులు కుమ్మరి మాసన్న గారు, నరసింహ గారు, జిల్లా నాయకులు ఆంజనేయులు ముదిరాజ్ గారు, కే ఆనంద్ గారు, మరియు కావాలి మల్లేష్ గారు, నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు*



