ePaper
Saturday, September 19, 2026
ePaper
Homeఎడిటోరియల్ఖానాపురంలో గడ్డివాము దగ్ధం

ఖానాపురంలో గడ్డివాము దగ్ధం

📰 Generate e-Paper Clip

ఖానాపురంలో గడ్డివాము దగ్ధం
రూ.70 వేల ఆస్తి నష్టం
ఖానాపురం, సెప్టెంబర్ 17 (నమస్తే భారత్): ఖానాపురం మండల కేంద్రంలో గురువారం సాయంత్రం ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధమైన ఘటన చోటుచేసుకుంది. స్థానికుడు మర్రి రవి తన ఇంటి వెనుక ఉన్న స్థలంలో గేదెల మేత కోసం సుమారు మూడు ఎకరాల గడ్డిని వాముగా ఏర్పాటు చేసుకున్నాడు. గురువారం సాయంత్రం అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది.
అగ్ని ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే నర్సంపేట అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్‌ ఇంజన్‌తో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.70 వేల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు మర్రి రవి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!