ePaper
Tuesday, September 22, 2026
ePaper
Homeతెలంగాణమార్కెట్‌యార్డులో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ పనులు ప్రారంభం

మార్కెట్‌యార్డులో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ పనులు ప్రారంభం

📰 Generate e-Paper Clip

మార్కెట్‌యార్డులో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ పనులు ప్రారంభం


ఖానాపురం సెప్టెంబర్ 2(నమస్తే భారత్ ) :
ఖానాపురం మండల కేంద్రంలోని మార్కెట్‌యార్డులో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణపు పనులను ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. వ్యవసాయ కూలీలు, మార్కెట్‌యార్డుకు వచ్చే రైతులు, గ్రామస్థులతో పాటు ఎంపీడీవో కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం మరియు పోలీస్‌స్టేషన్‌కు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజల సౌకర్యార్థం ఈ శానిటరీ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.
ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన పారిశుధ్య వసతులు అందుబాటులోకి తీసుకురావడమే ఈ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాసరి రమేష్ , మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ హరిబాబు, ఎంపీడీవో వి. అద్వైత, ఎంపీఓ ఎ. సునీల్ కుమార్, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!