
*శీలం శ్రీను ఆధ్వర్యంలో షాద్‌నగర్‌లో వైఎస్ఆర్ 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు*
*సంక్షేమానికి చిరునామా వైఎస్ఆర్*
నమస్తే భారత్ షాద్ నగర్, సెప్టెంబర్ 02:మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్సీపీ యువనేత శీలం శ్రీను ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నివాళులర్పించారు. షాద్‌నగర్‌లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా శీలం శ్రీను మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన మహానేత వైఎస్ఆర్ అని కొనియాడారు. రాజశేఖరరెడ్డి అంటే సంక్షేమం.. సంక్షేమం అంటే రాజశేఖరరెడ్డి అని పేర్కొన్నారు.2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ వంటి పథకాలను అమలు చేసి పేదల సంక్షేమానికి కృషి చేశారని తెలిపారు. ముఖ్యంగా రైతు సంక్షేమమే లక్ష్యంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు చిరస్మరణీయమన్నారు. వైఎస్ఆర్ మరణించి 17 సంవత్సరాలు గడుస్తున్నా ప్రజల గుండెల్లో ఆయన చెరగని ముద్రగా నిలిచిపోయారని అన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ అభిమాని రమాదేవి, పత్తి సంతోష్, కుంటోళ్ల నరేష్, జహంగీర్, ఈదులపల్లి నర్సింహా, మనసాని రాంరెడ్డి, ఇసాక్, ఆవ శివ, చెన్నయ్య గౌడ్, ప్రవీణ్, సందీప్, ప్రకాష్ చారి, వెంకటేష్, గిరిబాబు, శ్రీనివాస్ రెడ్డి, నయూమ్ తదితరులు పాల్గొన్నారు.



