ePaper
Wednesday, September 2, 2026
ePaper
Homeతెలంగాణగిరిజన అడవి బిడ్డని ఆహ్వానించిన స్పెయిన్

గిరిజన అడవి బిడ్డని ఆహ్వానించిన స్పెయిన్

📰 Generate e-Paper Clip

గిరిజన అడవి బిడ్డని ఆహ్వానించిన స్పెయిన్

అంతర్జాతీయ సదస్సుకి ఏజెన్సీ అడవి బిడ్డ

స్పెయిన్ దేశంలో లో జరిగే అంతర్జాతీయ సదస్సుకు అప్పరాజుపల్లి గ్రామవాసి ప్రొఫెసర్ మోహన్ ధారావత్

నమస్తే భారత్ :-మహబూబాబాద్

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అప్పలరాజు పల్లి దుబ్బ తండ గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ తేజ నాయక్ కుమారుడైన మోహన్ దారావత్ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడం, మారుమూల ప్రాంతమైన దుబ్బ తండ ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ ఉన్నత స్థాయికి చేరుకున్న మోహన్ దారావత్. అడవి ప్రాంతంలో బస్సులు లేకపోయినా ఇలాంటి సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో నేను ఏదో సాధించాలి అని గ్రామం నుంచి పట్టణానికి వచ్చి ఉన్నత చదువులు చదివి ప్రొఫెసర్ గా విద్యార్థులకు పాఠాలు చెబుతూనే అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ, కుల, జాతి నిర్మూలణ కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్న మోహన్ ధరావత్ ని ప్రపంచ అంతర్జాతీయ వేదికలలో ప్రసంగించే అవకాశం కల్పించిన స్పెయిన్ యూనివర్సిటీ వారికి రుణపడి ఉంటానని మోహన్ ధరావత్ ఆనందం వ్యక్తం చేశారు.ఇంటర్నేషనల్ సోషియలాజికల్ అసోసియేషన్ (ఐఎస్ఏ ఆర్సీ 41)లోని రిసెర్చ్ కమిటీ ఆన్ సోషియాలజీ ఆఫ్ పాప్యులేషన్ తరఫున, స్పెయిన్ లో జరగబోయే అంతర్జాతీయ సదస్సులో వ్యక్తిగతంగా పాల్గొనవలసిందిగా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో ఆచార్యులుగా పనిచేస్తున్న, అప్పరాజుపల్లి గ్రామం, మహబూబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ మోహన్ ధారవత్ ని ఆహ్వానించడం మా గౌరవంగా భావిస్తున్నాము.
యూనివర్సిటీ ఆఫ్ మాడ్రిడ్ నిర్వహించే ప్రపంచ ఉత్తర మరియు దక్షిణ దేశాల ప్రాంతాలలో జనాభా గతిశీలత నిర్మాణంలో మార్పులు, వలసలు మరియు మారుతున్న ప్రదేశాలు అనే పేరుతో నిర్వహించనున్న ఈ అంతర్జాతీయ సదస్సు 2026 సెప్టెంబర్ 10 మరియు 11 తేదీలలో, స్పెయిన్‌లోని కార్లోస్ III యూనివర్సిటీ ఆఫ్ మాడ్రిడ్, గెటాఫే క్యాంపస్‌ స్పెయిన్ లో జరిగే ఈ అంతర్జాతీయ సదస్సులో డాక్టర్ మోహన్ దారావత్ కులం, వలసలు మరియు అసమానతలు.ప్రపంచవ్యాప్తంగా కుల వ్యవస్థ కొనసాగింపు, కుల వ్యతిరేక ఉద్యమాలు అనే అంశం.మీద.ప్రసంగించబోతున్నారు. ఈ సదస్సులో పాల్గొనడానికి అయ్యే ప్రయాణ, వసతి, స్థానిక ఆతిథ్యం తో పాటు అయ్యే ఇతర ఖర్చులను మాడ్రిడ్ విశ్వవిద్యాలయమే ప్రత్యేక గ్రాంట్ ను మంజూరు చేయబడింది.ప్రొఫెసర్ మోహన్ ధరావత్ దళితుల, బహుజనుల మరియు గిరిజన -ఆదివాసుల సమస్యల పైన పరిశోధనలు చేస్తూ వాటిని వివిధ అంతర్జాతీయ దేశాల వేదికలలో పాల్గొని ప్రసంగించడం జరుగుతుంది. ప్రొఫెసర్ మోహన్ కు దక్కిన ఈ అరుదైన గౌరవానికి గాను వారి స్నేహితులు, బందుమిత్రులు, శ్రేయోభిలాషులు మరియు అప్పరాజుపల్లి మరియు దుబ్బగూడెం గ్రామ ప్రజలు వారి కీర్తిని ప్రశంసించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!