ePaper
Wednesday, August 19, 2026
ePaper
Homeఎడిటోరియల్కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది

📰 Generate e-Paper Clip

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది


సిపిఐ జాతీయ సమితి సభ్యులు పాలమాకుల జంగయ్య

రాజేంద్రనగర్, ఆగస్ట్ 18 నమస్తే భరత్,ప్రతినిధి ,కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలను సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సిపిఐ జాతీయ సమితి సభ్యులు పాలమాకుల గంగయ్య అన్నారు
సిపిఐ రంగారెడ్డి జిల్లా ప్రజా చైతన్య యాత్ర నేడు శంషాబాద్ మండల కేంద్రానికి వచ్చిన సందర్భంగా అంబేద్కర్ కూడలిలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రైతులు, యువత, విద్యార్థులు, కార్మికులు, పేదలు ప్రభుత్వ విధానాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని ఆర్థిక సామాజిక పరంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ఇచ్చిన హామీలు అమలు కాలేదని, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని అన్నారు. రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.దేశంలోని నిరుద్యోగ యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోలేదని సత్యం విమర్శించారు.
విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. పోటీ పరీక్షల్లో అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకేజీలు వంటి ఘటనల వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇలాంటి ఘటనలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు, స్వతంత్ర సంస్థల పనితీరుపై ప్రజల్లో ఆందోళన నెలకొందని సత్యం అన్నారు. ప్రతిపక్షాల గొంతును అణచివేయడానికి ప్రయత్నాలు జరగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై జరిగే ఉద్యమాలను అణచివేయడం కాకుండా, ప్రజల డిమాండ్లను ప్రభుత్వం గౌరవించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు.రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూసేకరణ, భూముల సమస్యలపై రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సత్యం కోరారు. రైతుల హక్కులకు భంగం కలిగించే విధానాలను సీపీఐ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని స్పష్టం చేశారు.రంగారెడ్డి జిల్లాలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా చైతన్య కార్యక్రమాలను విజయవంతం చేస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు జంగయ్య అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజా సమస్యలపై ఐక్యంగా పోరాటాలను కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.
సీపీఐ జాతీయ పార్టీ పిలుపులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో చేపట్టిన ఐదు రోజుల బస్సు యాత్రలో భాగంగా ప్రజా చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జంగయ్య తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, ప్రజల సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శివార్ల ప్రాంతాల నుంచి ప్రారంభమైన ఈ యాత్ర జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల మీదుగా కొనసాగుతుందని తెలిపారు.

సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల పార్టీ కార్యదర్శులు, ప్రజాసంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని బస్సు యాత్రను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారుకార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, సామాజిక భద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించాలని ఆయన కోరారు. ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక భద్రత వంటి మౌలిక సదుపాయాలను కల్పించడమే ప్రభుత్వాల ప్రధాన బాధ్యత కావాలని అన్నారు.
దేశంలో ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ వ్యవస్థలను కాపాడేందుకు ప్రజాస్వామ్య శక్తులు ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు.ప్రజా చైతన్య బస్సు యాత్రలో సిపిఐ రాష్ట్రస కార్యవర్గ సభ్యుడు అందోజు రవీంద్ర చారి కంట్రోల్ కమిషన్ సభ్యులు పుస్తకాల నర్సింగ్ రావు పానుగంటి పర్వతాలు బుద్ధుల జంగయ్య ఓరుగంటి యాదయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు ఏం ప్రభు లింగం ఆర్ యాదగిరి పి శివకుమార్ శ్రీదేవి దత్తు నాయక్ గార క్రాంతి వంశి వర్ధన్ రెడ్డి సుధాకర్ నర్రగిరి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!