ఈ నెల 6 వ తేదీన పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి
విద్యార్థుల మహా ధర్నా విజయంతం చేయాలి ఎస్ఎఫ్ఐ
విద్యార్థుల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ విద్య పరిరక్షణే ధ్యేయం ఎస్ఎఫ్ఐ
షాద్ నగర్ డివిజన్ కార్యదర్శి వడ్ల శ్రీకాంత్
షాద్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు విజ్ఞాన్ డిగ్రీ విద్యార్థులతో సమావేశం.
నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్04:విద్యార్థుల సమస్యల పరిష్కారం, విద్యా హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ విద్య బలోపేతమే లక్ష్యంగా ఈనెల 6న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ (ధర్నా చౌక్) వద్ద నిర్వహించనున్న ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని మేరకు మంగళవారం షాద్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఎ షాద్ నగర్ డివిజన్ కార్యదర్శి వడ్ల శ్రీకాంత్ విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది.
శ్రీకాంత్ మాట్లాడుతూ.. విద్యా రంగంలో ఎదురవుతున్న సమస్యలపై పోరాడేందుకు, దుకు ప్రభుత్వ విద్యను కాపాడుకు నేందుకు ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని తలపెట్టినట్టు తెలిపారు. విద్యార్థులందరూ ఐక్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. విద్యార్థుల హక్కుల సాధన కోసం కార్యక్రమానికి షాద్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్వహించే ఈ పోరాటాన్ని జయప్రదం చేయడం ప్రతి విద్యార్థి బాధ్యత అని పేర్కొన్నారు. 6న జరిగే ధర్నా చౌక్ విద్యార్థులతో పాటు పరిసర ప్రాంతాల కళాశాలల విద్యా ర్థులు భారీ సంఖ్యలో తరలిరావాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ టౌన్ ఉపాధ్యక్షులు అదిల్, చరణ్, ఎస్ఎఫ్ఐ నాయకులు శివ, రాంచరణ్, తరుణ్,రాజేష్, శ్రీనేతన్ మరియు తదితరులు పాల్గొన్నారు.





