ePaper
Saturday, July 25, 2026
ePaper
Homeఎడిటోరియల్రైతు చెమటకు గౌరవంగా.. పొలంలో కేటీఆర్ జన్మదిన సంబరాలు

రైతు చెమటకు గౌరవంగా.. పొలంలో కేటీఆర్ జన్మదిన సంబరాలు

📰 Generate e-Paper Clip

*రైతు చెమటకు గౌరవంగా.. పొలంలో కేటీఆర్ జన్మదిన సంబరాలు*

*మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్*

*వ్యవసాయ క్షేత్రంలో వినూత్నంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు…*

నమస్తే భారత్ షాద్ నగర్ జులై24:బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని షాద్‌నగర్ నియోజకవర్గంలోని లింగారెడ్డిగూడ గ్రామంలో మాజీ సర్పంచ్ భీశ్వ మాధవి – రామకృష్ణ దంపతుల వ్యవసాయ క్షేత్రంలో వినూత్నంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజల సమక్షంలో కేక్ కట్ చేసి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రైతు సంక్షేమం, తెలంగాణ అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో కేటీఆర్ చేసిన సేవలను ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. రైతును గౌరవించే భావనతో వ్యవసాయ క్షేత్రంలో జన్మదిన వేడుకలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేటీఆర్ మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవలో కొనసాగాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని బీఆర్ఎస్ శ్రేణులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వంకాయల నారాయణరెడ్డి, రవీందర్ యాదవ్, మాజీ ఎస్సి ఎస్టీ కమీషన్ సభ్యులు రాంబాల్ నాయక్, మాజీ సహకార యూనియన్ కార్పోరేషన్ చైర్మన్ రాజవరప్రసాద్, మాజీ స్త్రీ శిశు సంక్షేమ కోఆర్డినేటర్ రాజ్యలక్ష్మి, మాజీ మార్కెట్ చైర్మన్లు, మాజీ పీఎసీఎస్ చైర్మన్లు, మండల, గ్రామ, వార్డు పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!