కుత్బుల్లాపూర్‌లో 22% ఇళ్లలో ఒక్క మొక్క కూడా లేదు

కుత్బుల్లాపూర్‌లో 22% ఇళ్లలో ఒక్క మొక్క కూడా లేదు ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా 1200 కుటుంబాల రాండమ్ సర్వేలో ఆసక్తికర విషయాలు హైదరాబాద్, సెప్టెంబర్ 16 (వార్త): ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 1200 కుటుంబాలపై నిర్వహించిన నమూనా రాండమ్ హౌస్‌హోల్డ్ సర్వేలో పర్యావరణానికి సంబంధించిన పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఓజోన్ పొర ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్నప్పటికీ, ప్రతి ఐదు కుటుంబాల్లో ఒక కుటుంబంలో కూడా ఒక్క మొక్క లేకపోవడం ఆందోళన కలిగించే విషయంగా...