NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 7:53 am Posted by : NAMASTHE BHARAT

కుత్బుల్లాపూర్‌లో 22% ఇళ్లలో ఒక్క మొక్క కూడా లేదు

కుత్బుల్లాపూర్‌లో 22% ఇళ్లలో ఒక్క మొక్క కూడా లేదు
ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా 1200 కుటుంబాల రాండమ్ సర్వేలో ఆసక్తికర విషయాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (వార్త):
ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 1200 కుటుంబాలపై నిర్వహించిన నమూనా రాండమ్ హౌస్‌హోల్డ్ సర్వేలో పర్యావరణానికి సంబంధించిన పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఓజోన్ పొర ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్నప్పటికీ, ప్రతి ఐదు కుటుంబాల్లో ఒక కుటుంబంలో కూడా ఒక్క మొక్క లేకపోవడం ఆందోళన కలిగించే విషయంగా తేలింది.
ఈ ఏడాది ప్రపంచ ఓజోన్ దినోత్సవం “చల్లటి గ్రహం కొరకు ప్రపంచ ప్రయత్నం – శితలికరణ గ్రహం కిగాలి ఉద్యమ దశాబ్ది సంబురాలు ” అనే అంశంతో నిర్వహించబడుతోందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. మాంట్రియల్ ప్రోటోకాల్, కిగాలి సవరణల ద్వారా ఓజోన్ పొర రక్షణతో పాటు పర్యావరణహిత శీతలీకరణ వ్యవస్థలను ప్రోత్సహించడం ఈ ఏడాది ప్రధాన లక్ష్యమని వెల్లడించింది.మొక్కల విషయానికి వస్తే, 22 శాతం కుటుంబాల్లో ఒక్క మొక్క కూడా లేకపోగా, 40 శాతం కుటుంబాల్లో 1 నుంచి 5 మొక్కలు మాత్రమే ఉన్నాయి. 23 శాతం కుటుంబాల్లో 6 నుంచి 10 మొక్కలు, 15 శాతం కుటుంబాల్లో 10 కంటే ఎక్కువ మొక్కలు ఉన్నట్లు సర్వే సూచించింది.
ఓజోన్‌పై అవగాహన
సర్వేలో 73 శాతం మంది ఓజోన్ పొర సూర్యుడి హానికర అతినీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తుందని తెలుసునని తెలిపారు. అదే సమయంలో 89 శాతం కుటుంబాలు ప్రతి ఇంట్లో కనీసం ఐదు మొక్కలు ఉండేలా ఉద్యమం చేపట్టాలని అభిప్రాయపడ్డాయి.
నిపుణుల సూచనలు
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, నగరీకరణ, వాహనాల వినియోగం నేపథ్యంలో ప్రతి కాలనీలో మొక్కలు పెంచడం, పర్యావరణహిత శీతలీకరణ పరికరాలను ఉపయోగించడం, సీ ఎఫ్ సి,, హెచ్ ఎఫ్ సి వంటి ఓజోన్‌కు హానికర రసాయనాల వినియోగాన్ని పూర్తిగా తగ్గించడం అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు.ప్రజలకు పిలుపు
ప్రతి కుటుంబం కనీసం ఐదు మొక్కలు నాటడం, పర్యావరణహిత ఏ సి లు, ఫ్రిజ్‌లను ఉపయోగించడం, ఓజోన్ పరిరక్షణపై పిల్లల్లో అవగాహన పెంచడం ద్వారా “చల్లని గ్రహం – సురక్షిత భవిష్యత్తు” లక్ష్యాన్ని సాధించవచ్చని మధుబాబు చికిలే (స్కిలోక్రాట్ ), నేషనల్ డైరెక్టర్ , వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలిపారు.స్కిలోక్రసీ మరియు ఓయ్ సంస్థల సహకారంతో డిగ్రీ విద్యార్థులు చేసిన సర్వే.
ఈ గణాంకాలు ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా రూపొందించిన 1200 కుటుంబాల నమూనా ఆధారంగా రూపొందించిన అవగాహన నివేదికలోని నమూనా ఫలితాలు మాత్రమే.

సూరారం డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ లోని గీతాంజలి హై స్కూల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రపంచ మానవ హక్కుల సమితి జాతీయ డైరెక్టర్,మధుబాబు చికిలే,వెబ్ట్రైక్స్ సందీప్ బల్లెం,పాఠశాల కరెస్పాండంట్ మహిపాల్ రెడ్డి,ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.