NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 10:21 pm Posted by : NAMASTHE BHARAT

🙏 తుగ్గలి గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక విజ్ఞప్తి 🙏

🙏 తుగ్గలి గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక విజ్ఞప్తి 🙏

ఒక్కసారి ఆలోచించండి… ఎన్నికల్లో ఒక వ్యక్తి గెలిస్తే సరిపోతుందా? లేక మన ఊరు మొత్తం గెలవాలా?

తుగ్గలి నవంబర్ 15( నమస్తే భరత్ ):-తుగ్గలి గ్రామ పెద్దలకు, యువతకు, మహిళలకు, నా ఆత్మీయ గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు.

త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో నా మనసులో ఉన్న ఒక ఆలోచనను మీ ముందుంచుతున్నాను.

ప్రతి ఎన్నికల్లో ఎవరో ఒకరు గెలుస్తారు… ఎవరో ఒకరు ఓడిపోతారు. కానీ ఎన్నికల తర్వాత కూడా మనం ఒకే గ్రామానికి చెందినవాళ్లం. ఒకరి ఇంటికి మరొకరు వెళ్లాల్సిన వాళ్లం. కష్టసుఖాల్లో కలిసుండాల్సిన వాళ్లం.

మరి అలాంటి మన గ్రామంలో ఎన్నికల పేరుతో గొడవలు ఎందుకు? కక్షలు ఎందుకు? మనుషుల మధ్య దూరాలు ఎందుకు?

ఈసారి ఒక కొత్త ఆలోచనతో ముందుకు వెళ్దాం. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు… గ్రామ భవిష్యత్తు కోసం ఆలోచిద్దాం.

నా జీవితంలో నేను కోరుకునేది ఒక్కటే. మన తుగ్గలి గ్రామంలో ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలి. ప్రతి యువకుడికి ఉపాధి ఉండాలి. ప్రతి ఒక్కరూ ఎవరి మీద ఆధారపడకుండా తమ సొంత కాళ్ల మీద తాము నిలబడాలి. మన గ్రామంలో పేదరికం తగ్గాలి. మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి.

ఈ ఆలోచనతోనే ఈరోజు మీ అందరి ముందు ఒక మాట ఇస్తున్నాను.

ఒకవేళ నేను సర్పంచ్ ఎన్నికల బరిలో నిలబడితే, గ్రామ ప్రజలందరి సమిష్టి మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం కల్పిస్తే, నా వంతుగా ₹50 లక్షల ప్రత్యేక గ్రామ అభివృద్ధి నిధిని అందిస్తాను.

అదేవిధంగా ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీకి వచ్చే ₹15 లక్షల నిధులను కూడా గ్రామ అభివృద్ధి కోసమే వినియోగించేలా కృషి చేస్తాను.

మొత్తం ₹65 లక్షల అభివృద్ధి నిధులతో మన తుగ్గలి గ్రామానికి అవసరమైన రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు మరియు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందిద్దాం.

❤️ నా గ్రామ ప్రజలకు ఒక మాట…

నేను పదవి కోసం మీ ముందుకు రావడం లేదు. పదవితో వచ్చే గౌరవం కంటే, మన గ్రామానికి చేసిన అభివృద్ధి ద్వారా వచ్చే గుర్తింపు నాకు ముఖ్యం.

రేపు నేను పదవిలో ఉన్నా లేకపోయినా, మన గ్రామ ప్రజలు నన్ను ఒక మంచి పని చేసిన వ్యక్తిగా గుర్తుంచుకోవాలన్నదే నా ఆకాంక్ష.

మన గ్రామంలో ఎన్నికల కోసం అన్నదమ్ములు విడిపోకూడదు. స్నేహితులు శత్రువులు కాకూడదు. కుటుంబాల మధ్య విభేదాలు రాకూడదు.

ఒకసారి మనమందరం కలిస్తే మన తుగ్గలి అభివృద్ధిని ఎవరూ ఆపలేరు.

కాబట్టి గ్రామంలోని పెద్దలందరూ, యువత, మహిళలు, ప్రతి కుటుంబం ఒక్కసారి ఆలోచించండి. మన గ్రామ భవిష్యత్తు కోసం కలిసి కూర్చొని ఒక మంచి నిర్ణయం తీసుకుందాం.

నా ఆకాంక్ష ఒక్కటే…

నాకు ఓటు వేసే వాళ్లు ఎంతమంది అన్నది కాదు… నా గ్రామంలో అభివృద్ధి చెందే కుటుంబాలు ఎన్ని అన్నదే నాకు ముఖ్యం.

వ్యక్తి గెలుపు తాత్కాలికం… గ్రామ అభివృద్ధి శాశ్వతం!

మన తుగ్గలి గ్రామం కోసం… మన పిల్లల భవిష్యత్తు కోసం… మనందరి గౌరవం కోసం కలిసి ముందడుగు వేద్దాం.

మీ ఆశీర్వాదం, మీ అభిప్రాయం, మీ సహకారం కోరుకుంటూ…

మీ బిడ్డ, మీ అన్న, మీ గ్రామవాసి

తుగ్గలి నవీన్ రెడ్డి

మన ఊరు – మన బాధ్యత – మన అభివృద్ధి ❤️