NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 8:08 pm Posted by : NAMASTHE BHARAT

సైనిక కళాశాలలో డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

సైనిక కళాశాలలో డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

ఖానాపురం జూన్ 8 (నమస్తే భారత్ ) :

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం, అశోక్ నగర్ లోని సైనిక కళాశాలలో బీఎస్సీ ( ఎంపీసీ) మరియు బి ఏ (హెచ్ఈపి ) లలో ఫేస్ -2 అడ్మిషన్స్ కొరకు ఆసక్తిగల గిరిజన విద్యార్థులు దరఖాస్తులు వరంగల్ , కరీంనగర్ జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ డిఎస్ వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లా నుంచి అయినా, ఏ యాజమాన్యంలోని కళాశాల నుంచి అయినా 2026 మార్చ్ లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు నేరుగా సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లైన మార్క్స్ మెమో, టిసి, స్టడీ సర్టిఫికెట్ ,కులం,ఆదాయం, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఫోటో లతో దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అశోక్ నగర్ లోని సైనిక కళాశాలలో రిపోర్ట్ చేయాలని ,రిపోర్ట్ చేసిన అభ్యర్థులకు 12వ తేదీ ఉదయం ఆర్మీ సంబంధిత ఈవెంట్స్ నిర్వహించి అదే రోజు మెరిట్ ప్రకారంగా అడ్మిషన్స్ ఇవ్వబడతాయని తెలిపారు.ఆసక్తి గల విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని మరింత సమాచారం కోసం 9014559873 , 9963584516 మరియు 9398068250 నంబర్స్ ను సంప్రదించాలని తెలిపారు.

Applications Invited for Degree Admissions at Sainik College
Applications Invited for Degree Admissions at Sainik College