విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించాలి!

విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించాలి! పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ ఒకేసారి విడుదల చేయాలి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విజయవంతమైన 'చలో కలెక్టరేట్' నమస్తే భారత్ షాద్ నగర్, జులై 23:రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపుమేరకు రంగారెడ్డి జిల్లాలో 'చలో కలెక్టరేట్' కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పవన్ చౌహాన్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. "హలో విద్యార్థి.. చలో కలెక్టరేట్"...