NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 2:40 pm Posted by : NAMASTHE BHARAT

రిపోర్టర్‌పై దాడిఅ త్యంత దురదృష్టకరం 

రిపోర్టర్‌పై దాడిఅ త్యంత దురదృష్టకరం

బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

నర్సంపేట జూన్ 13 ( నమస్తే భారత్ ) :
ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభంగా ఉన్న మీడియా ప్రతినిధులపై దాడులు జరగడం అత్యంత దురదృష్టకరమని బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు.
శనివారం బాధిత రిపోర్టర్ ను పరామర్శించిన ఆయన మాట్లాడుతూ వార్తా సేకరణ కోసం విధులు నిర్వహిస్తున్న నర్సంపేట రిపోర్టర్‌ సత్యనారయణపై శుక్రవారం దాడి జరగడం నర్సంపేటలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోందన్నారు.
దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత రిపోర్టర్‌కు న్యాయం చేయాలని పోలీసు అధికారులను డిమాండ్ చేశారు. జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన కోరారు.
ప్రశ్నించే గొంతులను అణచివేయాలనే ప్రయత్నాలను ప్రజాస్వామ్యవాదులు ఎప్పటికీ సహించరని డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్,మాజీ కౌన్సిలర్ జుర్రు రాజు,ఉపాధ్యక్షులు ఠాకూర్ విజయ్ సింగ్,కాసుల నాగేంద్ర బాబు, బిజెవైఎం జిల్లాఉపాధ్యక్షులు కొంకిస విఘ్నేష్ ,పులిపాక అశోక్,శోభన్,సామల ప్రవీణ్,చిలువేరు అన్వేష్ ,గోస్కుల సందీప్ ,చందు,యశ్వంత్ మరియు తదితరులు పాల్గొన్నారు.