NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 11:41 am Posted by : NAMASTHE BHARAT

రాపర్తి నగర్ బాలికపై దాడి ఘటన: నిందితుడ్ని కఠినంగా శిక్షించాలి

*ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారించి గరిష్ఠ శిక్ష వేయాలని డిమాండ్

జి ఎల్ బి కే ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యస్ డి నా సర్ పాషా

నమస్తే భారత్: భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో (మూర్తి)

ఖమ్మం నగరం రాపర్తి నగర్‌లో 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించి 4వ అంతస్తు నుంచి కిందకు నెట్టిన ఘటన మానవత్వానికే మాయని మచ్చ అని గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యస్ డి నా సర్ పాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 6న జరిగిన ఈ అమానుష ఘటనలో నిందితుడు గౌస్ బాలికపై లైంగిక దాడికి యత్నించి, ఆమె కేకలు వేయడంతో సాక్ష్యాలు లేకుండా చేయడానికి బాలికను అపార్ట్‌మెంట్ పైనుంచి తోసేశాడనీ . ఈ దాడిలో బాలిక వెన్నుముక, పక్కటెముకలు విరిగి తీవ్రంగా గాయపడి ప్రస్తుతం హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతోందనీ వార్తలు వస్తున్నాయని చిన్నారిపై ఇంత కిరాతకంగా ప్రవర్తించిన నిందితుడ్ని చట్టంలోని అత్యంత కఠిన సెక్షన్ల కింద శిక్షించాలని డిమాండ్ చేశారు. పోప్ యాక్ట్, బి ఎన్ ఎస్ హత్యాయత్నం కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారించి గరిష్ఠ శిక్ష వేయాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసులను కోరారు. బాధిత బాలికకు నిమ్స్‌లో ఉచితంగా మెరుగైన వైద్యం అందించడంతో పాటు, కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, పునరావాసం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నిందితుడికి ఎలాంటి రాజకీయ/ప్రభావిత వ్యక్తుల అండదండలు లేకుండా, చట్టం తన పని తాను చేసేలా చూడాలని అన్నారు.
సమాజంలో బాలికల భద్రతపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి కామాంధులను కఠినంగా శిక్షించడం ద్వారానే ఇతరులకు హెచ్చరిక జారీ అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు
కె రమాదేవి,నూనె రమణ,బట్రాజు సమత,గుండాల కొమరమ్మ, వి నాగమణి ,రాజేశ్వరి, మైపా నాగమణి,,,పద్మ, నువ్వుల వజ్రమ్మ,సీత, డి రవి, భూక్య రమేష్, సుమన్ తదితరులు పాల్గొన్నారు