మరిపెడ పీహెచ్ పరిధిలో విజయవంతంగా ‘ఆల్బెండజోల్ టాబ్లెట్ మోపప్ డే

* డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో మాత్రల పంపిణీ
* వైద్య సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో పాల్గొన్న స్కూల్, అంగన్‌వాడీ టీచర్లు
నమస్తే భారత్ :-మారిపెడ
మహబూబాబాద్ జిల్లా మారిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్ ) పరిధిలో 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు మరియు యువతకు ఆల్బెండజోల్ టాబ్లెట్ల పంపిణీ ‘మోపప్ డే’ కార్యక్రమం ఈరోజు (జూలై 20న) విజయవంతంగా నిర్వహించబడింది. వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి నేతృత్వంలో ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.గత సోమవారం నాడు నిర్వహించిన జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం సందర్భంగా వివిధ కారణాల వల్ల టాబ్లెట్ వేసుకోలేక మిగిలిపోయిన పిల్లలందరికీ ఈరోజు పూర్తి స్థాయిలో మాత్రలను అందజేశారు. ఇందులో భాగంగా మారిపెడ పీహెచ్ పరిధిలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు, ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సిబ్బంది స్వయంగా వెళ్లి ఆల్బెండజోల్ మాత్రలను మింగించారు. పిల్లల్లో నులిపురుగుల నివారణ, వారి శారీరక, మానసిక ఎదుగుదలకు మరియు రక్తహీనత (అనేమియా నిర్మూలించడానికి ఈ మాత్రలు ఎంతో దోహదపడతాయని వైద్యాధికారులు ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ స్వామి, డాక్టర్ కిరణ్, హెల్త్ సూపర్‌వైజర్లు ఆచార్యులు, లక్ష్మి కుమారి, మాధవి, పల్లె దవాఖాన సిబ్బంది ఝాన్సీ, అఖిల, సతీష్, ఉపేంద్ర, అనిత, సౌజన్య, సరిత, ఆశా ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. వీరితో పాటు ఆయా విద్యాలయాల స్కూల్ టీచర్స్, అంగన్‌వాడీ టీచర్స్ చొరవ తీసుకుని విద్యార్థులందరికీ మాత్రలు అందేలా చూసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేశారు.