మడిపల్లిలో ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సు

నమస్తే భారత్ :-తొర్రూరు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో మడిపల్లి గ్రామంలో సర్పంచ్ నలుగురి రామలింగం అధ్యక్షతన బుధవారం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలు మరియు పంట మార్పిడి విధానాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా వ్యవసాయ విస్తరణ అధికారి వి.ప్రవీణ్, నీటిపారుదల శాఖ ఏఈఈ గోపి లు మాట్లాడుతూ ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు తక్కువ నీటితో సాగు చేసి పెసర్లు, కందులు, మినుములు, ఆయిల్.పామ్,బొబ్బర్లు,జొన్నలు ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకోవాలని,శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని సూచించారు. అలాగే పంట మార్పిడి ద్వారా భూసారాన్ని కాపాడుకోవడంతో పాటు దిగుబడులు,ఆదాయం పెరుగుతాయని,రైతులకు ప్రభుత్వ సూచనలు, శాఖ అందిస్తున్న సేవలు, వర్షాభావ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమగ్ర పంట నిర్వహణపై అవగాహన అవసరమన్నారు.ఈ కార్యక్రమంలో.గ్రామపంచాయతీ కార్యదర్శి హేమలత,ఉప సర్పంచ్ కొండం మనిషా ఉపేందర్, వాడు సభ్యులు ఎం.యాకయ్య, పుల్లయ్య, సిహెచ్.యాకయ్య, ప్రమోద్, శిరీష, రైతులు తదితరులు పాల్గొన్నారు.