భద్రాద్రి‘జలనిధి’..రోళ్ళపాడు‘ద్వీప’సిరి గిరిజన పల్లెల్లో పర్యాటక విప్లవం!

భద్రాద్రి‘జలనిధి’..రోళ్ళపాడు‘ద్వీప’సిరి గిరిజన పల్లెల్లో పర్యాటక విప్లవం! నమస్తేభారత్:టేకులపల్లి,జూన్ 14 -అటు రైతన్నలు.. ఇటు పర్యాటకులు.. మధ్యలో మత్స్యకారుల సిరులు! -సీతారామ ప్రాజెక్టు పూర్తితో మారనున్న టేకులపల్లి ముఖచిత్రం -రోళ్ళపాడును పర్యాటక కేంద్రంగా మార్చాలని గ్రామస్తుల ఏకగ్రీవ డిమాండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,టేకులపల్లి మండలంలోని రోళ్ళపాడు గ్రామపంచాయతీ పరిధిలో ప్రకృతి ప్రసాదించిన అపురూప వరప్రసాదమైన ‘రోళ్ళపాడు ద్వీపం’నేడు అన్వేషించని ఒక పర్యాటక వజ్రంలా మెరుస్తోంది.ప్రతిష్టాత్మక 'సీతారామ ఎత్తిపోతల పథకం'జలాల కలయికతో ఈ ప్రాంతం సరికొత్త జలకళను సంతరించుకుంది.దట్టమైన అరణ్యం,చుట్టూ స్వచ్ఛమైన జలరాశి,మధ్యలో ఆకుపచ్చని ద్వీపంతో అలరారుతున్న...