NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 2:36 pm Posted by : NAMASTHE BHARAT

బహదూర్‌పల్లిలో రోడ్ల మరమ్మతులు పూర్తి

బహదూర్‌పల్లిలో రోడ్ల మరమ్మతులు పూర్తి

ప్రజా సమస్యల పరిష్కారంలో కిషోర్ రెడ్డి చొరవకు ప్రశంసలు

వర్షాకాలానికి ముందే గుంతల రోడ్లకు ప్యాచ్ వర్కులు

తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లకు కొత్త మూతల ఏర్పాటు

అధికారులు, సిబ్బంది వేగవంతమైన స్పందన

కాలనీ ప్రజల తరఫున కిషోర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు

కుత్బుల్లాపూర్, జూన్ 13 ( నమస్తే భరత్ ): వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలలో భాగంగా బహదూర్‌పల్లి 294వ డివిజన్‌లో రోడ్ల మరమ్మతులు, మ్యాన్‌హోల్ మూతల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. ఈ పనుల అమలుకు కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రోటోకాల్ అండ్ కోఆర్డినేషన్ వైస్ చైర్మన్ బొంగునూరి కిషోర్ రెడ్డికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్ పరిధిలో గుంతలమయంగా మారిన రోడ్లు, తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌ల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన కిషోర్ రెడ్డి, సంబంధిత అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన ఆదేశాల మేరకు అధికారులు స్పందించి రోడ్లకు ప్యాచ్ వర్కులు పూర్తి చేయడంతో పాటు ప్రమాదకరంగా ఉన్న మ్యాన్‌హోల్‌లకు కొత్త మూతలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 294వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ.ఆర్. సాదు యాదవ్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో వేగంగా స్పందించి పనులు పూర్తి చేయడం అభినందనీయమన్నారు. వర్షాకాలంలో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల కాలనీ వాసులకు ఉపశమనం కలిగిందని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న కిషోర్ రెడ్డి, సహకరించిన అధికారులకు, సిబ్బందికి కాలనీ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల భద్రత, సౌకర్యాల విషయంలో ఇలాంటి చర్యలు కొనసాగాలని స్థానికులు ఆకాంక్షించారు.