NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 8:20 pm Posted by : NAMASTHE BHARAT

ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ ప్రోగ్రాం పదేళ్లు గడచిన సందర్భంగా అవగాహన సదస్సు

ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ ప్రోగ్రాం పదేళ్లు గడచిన సందర్భంగా అవగాహన సదస్సు

డాక్టర్ స్రవంతి పి హెచ్ సి చించోడు.

జె.శ్రీనివాసులు హెల్త్ ఎడ్యుకేటర్

నమస్తే భారత్ షాద్ నగర్ జూన్09: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడులో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ ప్రోగ్రాం మన భారతదేశంలో ప్రారంభించి ఈరోజుకు 10 సంవత్సరముల నిండిన సందర్భంగా, చించోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ స్రవంతి ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ ప్రోగ్రాం కు వచ్చిన గర్భవతులకు , ప్రతినెల 9వ తారీకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం లో, గర్భవతులకు అందించే సేవల గురించి వివరంగా తెలియజేశారు. ప్రతి నెల 9వ తేదీన ప్రభుత్వాసుపత్రిలో గర్భిణీలకు అన్ని రకాల పరీక్షలు , ఫ్రీ ఆ సేవలు అందిస్తున్నామని తెలియజేశారు. పి హెచ్ సి యు అందించే సేవలు హైరిస్క్ గర్భిణీల వ్యక్తిగత పర్యవేక్షణ గురించి , సురక్షిత ప్రసవం యొక్క పాలో అప్ గురించి, గర్భిణీలకు 102 వాహనం ద్వారా అందే ఉచిత రవాణా సౌకర్యం గురించి, సురక్షిత ప్రసవం కోసం సమీప ఫస్ట్ రిఫరల్ యూనిట్ గురించి, అధిక ప్రమాద గర్భధారణల గుర్తింపు గురించి, ప్రభుత్వాసుపత్రుల కాన్పుల గురించి, ప్రభుత్వాసుపత్రిలో ఇచ్చే వ్యాక్సిన్ ల గురించి, గర్భిణీ స్త్రీలకు అందించే ఐ ఎఫ్ ఏ మాత్రల గురించి, ప్రత్యేక గర్భిణీ సేవలను ఉచితంగా అందిస్తున్నామని డాక్టర్ స్రవంతి గర్భవతులకు తెలియజేశారు. తదుపరి హెల్త్ ఎడ్యుకేటర్ జె .శ్రీనివాసులు మాట్లాడుతూ స్త్రీలు గర్భం దాల్చిన మూడు నెలల్లోపు ఏ.ఎన్.ఎమ్ ల దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అని, గర్భవతులు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారందరికీ వెంటనే మూత్ర పరీక్షలు , రక్తం పరీక్షలు, బీ.పీ పరీక్షలు, థైరాయిడ్ పరీక్ష మరియు షుగర్ పరీక్షలు నిర్వహించి వారికి తగిన చికిత్స ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందిస్తారని జె.శ్రీనివాసులు తెలియజేశారు. గర్భవతులు అందరూ కూడా మంచి పోషకాహారము అనగా తాజా ఆకుకూరలు, తాజా కూరగాయలు, ఉడకబెట్టిన గుడ్లు, తాజా పండ్లు, పాలు ఆహారంలో భాగంగా తీసుకోవాలని జె.శ్రీనివాసులు చెప్పారు. ప్రతి గర్భిణి స్త్రీ ప్రతినెల తప్పకుండా చెకప్ లు చేయించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్రవంతి, ఎం ఎల్ హెచ్ పి వైద్య అధికారి డాక్టర్ సంధ్య, హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు, హెల్త్ సూపర్వైజర్ శ్రీ రామ, ల్యాబ్ టెక్నీషియన్ అశోక్, డీ.ఈ.వో విజయ, ఏ.ఎన్.ఎమ్.లు మధువాణి, అనురాధ మరియు ఆశలు పాల్గొన్నారు.