NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 12:03 pm Posted by : NAMASTHE BHARAT

ప్రజా సంక్షేమమే ధ్యేయం.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

ప్రజా సంక్షేమమే ధ్యేయం.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

నివాస కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, సంఘాల ప్రతినిధుల మర్యాదపూర్వక భేటీ

వివిధ సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆహ్వాన పత్రాల అందజేత

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ

కుత్బుల్లాపూర్ అభివృద్ధికి వివేకానంద్ కృషి ప్రశంసనీయమని నాయకుల అభినందనలు

కుత్బుల్లాపూర్, జూన్ 12 ( నమస్తే భరత్ ): ప్రజా సంక్షేమమే పరమావధిగా భావిస్తూ నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ను శుక్రవారం ఆయన నివాస కార్యాలయంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులు, సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివిధ సామాజిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వాన పత్రాలను ఎమ్మెల్యేకు అందజేయడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించిన వినతి పత్రాలను సమర్పించారు. ప్రజల సమస్యలు, అవసరాలను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఓర్పుగా విని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.


ప్రజలతో నిరంతరం మమేకమవుతూ వారి సంక్షేమం కోసం పనిచేయడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యతగా భావిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల సమర్థ అమలుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని ఆయన సూచించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సేవలను అభినందించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఆయన చూపుతున్న చొరవతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి అందిస్తున్న సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. ప్రజలతో సన్నిహితంగా మెలుగుతూ అందుబాటులో ఉండే నాయకుడిగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారని వారు పేర్కొన్నారు.